Share News

ఈశాన్య రాష్ట్రాల వారి కేవైసీ కష్టాలు.. నెట్టింట వీడియో వైరల్

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:11 PM

స్మార్ట్‌ఫోన్‌తో కేవైసీ పూర్తి చేసుకునేందుకు ఈశాన్య రాష్ట్రాల వారు పడే అగచాట్లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలను కడుపుబ్బా నవ్విస్తోంది.

ఈశాన్య రాష్ట్రాల వారి కేవైసీ కష్టాలు.. నెట్టింట వీడియో వైరల్
Northeast India KYC viral video

ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు కేవైసీ పూర్తి చేసుకునేందుకు ఆయా కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేంది. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే కొద్దీ ఇంటి నుంచి కాలు బయటపెట్టకుండానే ఈ పనిపూర్తి చేసుకునే అవకాశం వచ్చింది. స్మార్ట్ ఫోన్స్, యాప్స్‌తో ఈ పనిని ఇట్టే పూర్తి చేసుకోవచ్చు. అయితే, ఈ సాంకేతికకు కొన్ని పరిమితులు ఉన్నాయనే విషయం ఈశాన్య రాష్ట్రాల వారు రుజువు చేస్తున్నారు. ఈకేవైసీ పూర్తి చేసేందుకు ఈశాన్య భారత వ్యక్తి పడుతున్న అగచాట్లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. నాగాలాండ్ మంత్రి తెమ్జెన్ ఇమ్నా ఆలోంగ్ ఈ వీడియోను షేర్ చేశారు. సరదా కామెంట్స్, వీడియోలతో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి తాజాగా షేర్ చేసి వీడియో కూడా ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది.

యాప్‌ సాయంతో ఓ వ్యక్తి కేవైసీ పూర్తి చేసేందుకు గ్రామస్థులు నానా ప్రయాస పడాల్సి వచ్చింది. ఇక ఆ వ్యక్తి కష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ వ్యక్తి కళ్లు కాస్త మూసుకుపోయినట్టు ఉండటంతో ఫొటో తీసేందుకు చుట్టుపక్కల వాళ్లు నానా ఇబ్బందీ పడ్డారు. అతడి కంటి రెప్పలు తెరుచుకునేలా కొందరు లాగి పట్టుకోగా ఇతరులు ఫొటో తీసేందుకు ప్రయత్నించారు. చివరికి తమ పాట్లు చూసుకుని వారే పొట్టచెక్కలయ్యేటట్టు నవ్వుకున్నారు.


నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోకు కుప్పలు తెప్పలుగా వ్యూస్ వచ్చాయి. ఈ ఉదంతం నవ్వు పుట్టేదిగా ఉన్నప్పటికీ అక్కడి వారి ఇబ్బందులు తీర్చే ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని అనేక మంది సూచించారు. వేలి గుర్తుల ద్వారా బయోమెట్రిక్ పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని అన్నారు. చైనా, జపాన్, ఇతర సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల్లో వినియోగిస్తున్న పద్ధతులను అధ్యయనం చేసి భారత్‌లో అనుసరిస్తే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. భారత్‌లో వృద్ధులు కూడా కేవైసీ విషయాల్లో ఇబ్బందులు పడుతుంటారని, వీటికి పరిష్కారం కనుగొనాలని అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్ ‌లో ఉంది.


ఈ వార్తలనూ చదవండి:

ముంబై రైలా మజాకా.. కొరియా వ్యక్తికి చుక్కలు కనిపించాయిగా..

ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. రైలు ఎక్కుతుండగా..

Updated Date - Aug 14 , 2026 | 05:35 PM