చూసుకోవాలి కదక్కా.. రోడ్డు మీద నిర్లక్ష్యంగా నడిస్తే ఏం జరిగిందో చూడండి.. ఫన్నీ వీడియో వైరల్..
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:30 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ యువతికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (girl mistake viral).
@Ldphobiawatch అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వీధిలో మురుగు కాలువను శుభ్రం చేస్తున్నారు. మ్యాన్ హోల్ మూత తెరిచి పక్కన పెట్టారు. అయినా ఆ పక్క నుంచే చాలా మంది నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక వ్యక్తి మ్యాన్ హోల్ పక్క నుంచి నడచుకుంటూ వెళ్లాడు. వెనుక వస్తున్న ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా నడుస్తూ మ్యాన్ హోల్‌లో కాలు వేసింది. దీంతో బురదలో కూరుకుపోయింది (shocking public video).
ఆ ఘటన అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది (viral video). ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో బాగా వైరల్ అవుతోంది. వేల మంది ఆ వీడియోను వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. అక్కడ ఏం జరుగుతోందో ఆమెకు అర్థం కాలేదని ఒకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను.. స్థంభించిన జన జీవనం.. వేల విమాన సర్వీసులు రద్దు..
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియాకు రూ.1,100 కోట్లు..