Share News

నీలగిరి కొండ రోడ్డుపై ప్రమాదం.. 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన ట్రక్కు..

ABN , Publish Date - Nov 03 , 2026 | 09:53 AM

తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటుచేసుకుంది. కలప దుంగలతో వెళ్తున్న భారీ ట్రక్కు అదుపుతప్పి 100 అడుగుల లోతైన లోయలో పడిపోయింది.

నీలగిరి కొండ రోడ్డుపై ప్రమాదం.. 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన ట్రక్కు..
Kotagiri Accident

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటుచేసుకుంది. కోటగిరి సమీపంలోని కట్టబెట్టు ప్రాంతంలో యూకలిప్టస్ కలప దుంగలతో వెళ్తున్న భారీ ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బారికేడ్‌ను ఢీకొట్టి సుమారు 100 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. కొండ మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ భయానక ఘటనను స్థానికుడు తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రక్కు లోయలోకి దూసుకెళ్తూ భారీగా దుమ్ము లేపిన దృశ్యాలు నెటిజన్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.


ఈ ఘటనతో కొండ ప్రాంతాల్లో భారీ వాహనాల ప్రయాణ భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరుకైన మలుపులు.. ప్రమాదకరమైన లోయలు ఉన్న నీలగిరి రహదారులపై వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భారీ వాహనాల్లో అధిక లోడుతో ప్రయాణించడం, బ్రేకుల సమస్యలు వంటి అంశాలు ప్రమాదాలకు దారితీయవచ్చు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా, డ్రైవర్ పరిస్థితి ఏమిటనే విషయాలపై స్పష్టమైన సమాచారం తెలియాల్సి ఉంది. క్షణాల్లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి

Updated Date - Nov 03 , 2026 | 10:14 AM