Share News

వింత పోటీ.. చైనా గూఢచారిణిలా కనిపిస్తే ప్రైజ్ మనీ

ABN , Publish Date - Nov 23 , 2026 | 12:01 PM

ఎన్విడియా సీఈఓ ఎఫైర్ ఉదంతంలో చైనా గూఢచారిణిగా అనుమానాలున్న ఆలిస్‌లా కనిపించే వారికి బహుమతులిస్తామంటూ న్యూయార్క్‌లో తాజాగా నిర్వహించిన ఈవెంట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

వింత పోటీ.. చైనా గూఢచారిణిలా కనిపిస్తే ప్రైజ్ మనీ
Alice lookalike contest in Newyork

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారిన ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్, ఆలిస్‌‌ల ఎఫైర్‌ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు టెక్ రంగంలో ఇది కలకలం రేపుతుండగా నెటిజన్లు, కంటెంట్ క్రియేటర్లు ఈ అంశంపై కొత్త కొత్త మీమ్స్, ఏఐ వీడియోలతో నెట్టింట వ్యూస్‌ను, లైక్స్‌ను దండుకున్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్ నగరంలో నిర్వహించిన వింత పోటీ కూడా జనాలను అమితంగా ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.


నవంబర్ 21న ఫ్యాక్ట్‌మెషీన్, ప్రెజ్ అనే సంస్థలు ఈ పోటీని నిర్వహించాయి. చైనా గూఢచారి ఆలిస్‌లా కనిపించే వారిలో టాప్‌లో యువతిని ఎంపిక 50 డాలర్ల ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించింది. దీంతో, ఈ ఈవెంట్‌లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనేక మంది ఆలిస్‌లా మేకప్, డ్రెస్ వేసుకుని ఎన్విడియా సీఈఓను ముగ్గులోకి లాగుతున్నట్టు నటిస్తూ జనాలను ఆశ్చర్యపరిచారు. ఎన్విడియా సీఈఓ నుంచి సీక్రెట్ డాక్యుమెంట్స్ తస్కరిస్తున్నట్టు కూడా కొందరు నటించారు. జెన్సన్‌లా డ్రెస్ వేసుకున్న వ్యక్తి కూడా ఈ పోటీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాడు. ఇదంతా చూసిన అక్కడి ప్రేక్షకులే ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేశారు.


అయితే, ఈ వీడియోపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరికీ ఈ పోటీలు అమితంగా నచ్చాయి. జెన్సన్-ఆలిస్ ఉదంతం జనాల్లో క్రియేటివిటీని పీక్స్‌కు చేర్చిందని కొందరు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. మరికొందరు మాత్రం పెదవి విరిచారు. అసలు ఏ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేని తరం వచ్చేసిందని విచారం వ్యక్తం చేశారు. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


ఈ వార్తలనూ చదవండి:

కేరళం మహిళకు లాటరీలో రూ.46 కోట్లు

క్రమశిక్షణ అంటే ఇదీ.. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఫిదా

Updated Date - Nov 23 , 2026 | 12:15 PM