Share News

ఈమె అసలు మనిషేనా.. ఇంత దారుణం ఎలా చేయగలిగిందో!

ABN , Publish Date - Sep 17 , 2026 | 08:41 PM

నేపాల్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ కుక్కను వంతెనపై నుంచి నదిలోకి తోసేసింది.

ఈమె అసలు మనిషేనా.. ఇంత దారుణం ఎలా చేయగలిగిందో!
Woman pushes Dog into River in Nepal

ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ కుక్కను వంతెనపై నుంచి నదిలోకి తోసేసింది. బజ్‌హంగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ మహిళ కుక్కను తీసుకుని సేఠీ గండకీ నదిపై ఉన్న వంతెన మీదకు వెళ్లింది. కుక్కను నదిలోకి తోసేందుకు ప్రయత్నిస్తుండగా ఆ మూగ జీవం వణికిపోయింది. వంతెన చివరకు వెళ్లకుండా వెనక్కు జరిగే ప్రయత్నం చేసింది. కానీ మహిళ మాత్రం అత్యంత క్రూరంగా ఆ శునకాన్ని నదిలోకి తోసేసింది.


వరద ఎక్కువగా ఉండటంతో కుక్క కొట్టుకుపోయింది. ప్రాణాలను కాపాడుకునేందుకు శునకం విశ్వప్రయత్నం చేస్తున్న హృదయ విదారక దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి రికార్డు చేశాడు. వీడియో నిడివి కొన్ని క్షణాలే కావడంతో ఆ తరువాత కుక్కకు ఏమైందీ తెలియరాలేదు. అసలు మహిళ ఎవరు? కుక్కను ఎందుకు తోసేసింది? అనే అంశాలపై స్పష్టత లేదు.

అయితే, నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీడియోలోని మహిళపై చర్యలు తీసుకోవాలని అనేక మంది డిమాండ్ చేశారు. మరోవైపు, మహిళ ఎవరో తెలుసుకునేందుకు స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


ఈ వార్తలనూ చదవండి:

పర్యాటకులపై పడిన పాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. షాకింగ్ వీడియో

డ్రోన్‌ సాయంతో కుక్కకు స్నానం.. వీడియో చూస్తే అవాక్కవుతారు..

Updated Date - Sep 17 , 2026 | 08:51 PM