నేపాల్‌లో వరదల విలయం.. యజమానుల కోసం ఎదురు చూస్తున్న శునకాలు..
ABN , Publish Date - Sep 01 , 2026 | 01:55 PM
వరదల కారణంగా నేపాల్ సర్వం కోల్పోయింది. భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వేలకొద్దీ గృహాలు వరదలో కొట్టుకుపోయాయి. మరికొన్ని బురదలో కూరుకుపోయాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: వరదల కారణంగా నేపాల్ సర్వం కోల్పోయింది. భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వేలకొద్దీ గృహాలు వరదలో కొట్టుకుపోయాయి. మరికొన్ని బురదలో కూరుకుపోయాయి. జనం తమ ఇళ్ల శిథిలాల వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో వైపు పెంపుడు కుక్కలు తమ యజమానుల కోసం ఇళ్ల శిథిలాల దగ్గర పడిగాపులు కాస్తున్నాయి. శునకాల ఎదురుచూపులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఓ వీడియోలో.. ధుంగే ప్రాంతంలో లిల్లీ అనే కుక్క యజమానుల కోసం ఇంటి శిథిలాల దగ్గర ఎదురుచూస్తోంది. అది అక్కడినుంచి పక్కకు వెళ్లడంలేదు. తనకు తెలిసిన వాళ్లు ఎవరైనా కనిపించకపోతారా? అని ఎంతో ఆశతో ఎదురుచూస్తోంది. అయితే, దానికి తిండి పెట్టిన యజమానితో పాటు ఆ ప్రాంతంలోని చాలా మంది వరదల్లో గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇంకా లభించలేదు.
మరో వీడియోలో.. వరద కారణంగా ధ్వంసం అయిన బిల్డింగ్‌లోకి చేరి యజమానుల కోసం ఓ కుక్క ఎదురుచూస్తోంది. ఇంకో వీడియోలో.. నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఓ కుక్క తన యజమానిని చేరుకుంది. కుక్కతో పాటు యజమాని కూడా ఎంతో సంతోషించింది. శునకాలకు సంబంధించిన పదుల సంఖ్యలో వీడియోలు నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
‘ఆపరేషన్ సిందూర్’లో అదరగొట్టిన ఎస్-400కు మరో ఆర్డర్!
ఇంజిన్‌లో సాంకేతిక లోపం.. గోవాలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్