Share News

అదృష్టం అంటే వీళ్లదే.. వరదల్లో చుట్టూ అంతా నాశనమైనా..

ABN , Publish Date - Aug 29 , 2026 | 02:56 PM

అదృష్టానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఓ కుటుంబానికి సంబంధించిన వీడియోలు రెండు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు ‘నిజంగా అదృష్టం అంటే వీళ్లదే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అదృష్టం అంటే వీళ్లదే.. వరదల్లో చుట్టూ అంతా నాశనమైనా..
Nepal flash floods

ఇంటర్‌నెట్ డెస్క్: నేపాల్‌లో గత బుధవారం భారీ స్థాయిలో వచ్చిన మెరుపు వరదల కారణంగా పెద్ద మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వెయ్యికి పైగా మంది గల్లంతయ్యారు. ఉద్ధృతంగా ప్రవహించిన భోటేకోశీ నది నువాకోట్, ధాడింగ్ జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. టిబెట్ వైపు నుంచి వచ్చిన మెరుపు వరదల కారణంగా పలు ఊళ్లు, బ్రిడ్జ్‌లు, ప్రాజెక్ట్‌లు నీటిలో కొట్టుకుపోయాయి. ప్రకృతి విలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


అదృష్టానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఓ కుటుంబానికి సంబంధించిన వీడియోలు రెండు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. వెదర్ మానిటర్ ఎక్స్ ఖాతాలో పోస్టు అయిన ఓ వీడియోలో ఏముందంటే.. మూడు అంతస్తుల భవనం వరదల్లో చిక్కుకుపోయింది. ఆ భవంతిలోని మూడవ అంతస్తులో ఓ పది మందిదాకా జనం ఉన్నారు. ఆ భవంతి చుట్టు పక్కల ఉన్న అన్ని ఇళ్లను వరద నీరు ధ్వంసం చేసింది. భవంతి ముందు నుంచి పెద్ద పెద్ద వాహనాలు, భవనాల శిథిలాలు నీటిలో కొట్టుకుతున్నాయి.


శుభ అనే మహిళ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన మరో వీడియోలో వరద నీరు పూర్తిగా తగ్గిపోయిన తర్వాతి దృశ్యాలు ఉన్నాయి. నీటిలో చిక్కుకుపోయిన ఆ భవంతిలోని కింది రెండు అంతస్తులు బాగా దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున బురదలో కూరుకుపోయాయి. కానీ, భవంతి పెద్దగా దెబ్బతినలేదు. మూడవ అంతస్తులోని వారందరూ ప్రాణాలతో బయటపడ్డారు. సహాయం కోసం అరుస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు ‘నిజంగా అదృష్టం అంటే వీళ్లదే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఆ లలిత్ మోదీ నేను కాదు.. వెంటనే తప్పును సరిదిద్దండి: ఐపీఎల్ మాజీ ఛైర్మన్

నేపాల్‌ వరదల్లో కొట్టుకొచ్చిన బ్యాంక్‌ సేఫ్‌ను పగులగొట్టి.. రూ.లక్షల్లో దోచుకొని.

Updated Date - Aug 29 , 2026 | 03:02 PM