ఇంత కన్ఫ్యూజ్ చేసే యాక్సిడెంట్‌ను ఎక్కడా చూసుండరు.. వీడియో వైరల్..
ABN , Publish Date - Jun 27 , 2026 | 09:39 PM
ఢిల్లీలోని కనౌత్ ప్రాంతంలో చోటుచేసుకున్న కారు యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన ఆకాన్ష్ కుమార్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియోను షేర్ చేశాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఢిల్లీలోని కనౌత్ ప్రాంతంలో చోటుచేసుకున్న కారు యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన ఆకాన్ష్ కుమార్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియోను షేర్ చేశాడు. ‘కనౌత్ ప్రాంతంలో చోటుచేసుకున్న వింత యాక్సిడెంట్‌ను చూశా. ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు’ అని రాసుకొచ్చాడు. ఆ వీడియోలో ఏముందంటే.. యాక్సిడెంట్ తర్వాత కారు ఫుట్‌పాత్ సమీపంలోని చెట్టు దగ్గర ఆగిపోయింది. అయితే, ఆ కారు అంత పర్‌ఫెక్ట్‌గా అక్కడికి ఎలా వచ్చి చేరిందన్నది మిస్టరీగా మారింది.
కారు ఎడమ వైపు ముందు భాగం బాగా దెబ్బతింది. ఆ భాగం చెట్టుకు ఆనుకుని ఉంది. రోడ్డు మీద నుంచి చూస్తే ఆ కారు భవనం ఉన్న వైపు నుంచి దూసుకుచ్చి చెట్టును ఢీకొట్టినట్లుగా ఉంది. అయితే, ఆ భవనం వైపు నుంచి రావటానికి ఎలాంటి మార్గం లేదు. కారు చెట్టును ఢీకొట్టి పక్కకు తిరిగిందనుకుంటే.. ఫుట్‌పాత్‌లాంటి ఆ ప్రదేశంలో మొక్కలు నాటి ఉన్నాయి. ఆ మొక్కలకు ఏమీ కాకుండా ఆ కారు ఎలా అటు వైపు వెళ్లింది అన్నది అంతుచిక్కని ప్రశ్న. కారును ఎవరో చేతులతో ఎత్తి మొక్కలు, చెట్టు మధ్య ఉంచినట్లుగా ఆ దృశ్యం ఉంది.
ఆకాన్ష్ ఆ వీడియోలో ఈ విషయాల గురించి చెబుతూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇక, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘నేను అలాగే డ్రైవింగ్ చేస్తాను. మీరు నా డ్రైవింగ్ స్కిల్స్‌ను శంకిస్తున్నారా?’.. ‘నిజంగా ఈ వీడియో చూస్తుంటే నా మతిపోతోంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
భారత్, పాక్ మధ్య దౌత్యం.. తెర వెనుక చర్చలు?
ఆర్‌ఎస్ ప్రవీణ్ భద్రతపై ప్రభుత్వ విప్ దయాకర్ కీలక వ్యాఖ్యలు