Share News

భారత్, పాక్ మధ్య దౌత్యం.. తెర వెనుక చర్చలు?

ABN , Publish Date - Jun 27 , 2026 | 09:21 PM

భారత్‌తో పాక్ అధికారులు తెర వెనుక చర్చలు జరుపుతున్నట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడటం సంచలనానికి దారి తీసింది.

భారత్, పాక్ మధ్య దౌత్యం.. తెర వెనుక చర్చలు?
Reports of Track 1.5 Dialogue with Ind Appear in Pak Media

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్, పాక్ మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇరు దేశాల డీజీఎమ్‌ఓల మధ్య హాట్‌లైన్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, తెర వెనుక మాత్రం చర్చలు జరుగుతున్నట్టు పాక్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

ఇరు దేశాల ప్రభుత్వాలతో దగ్గరి సంబంధాలు ఉన్న వ్యక్తులు ఈ చర్చల్లో పాల్గొన్నట్టు కథనాలు వెలువడ్డాయి. ఇది ఇరు దేశాల మధ్య టైర్-2 దౌత్యమన్న వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఇరు దేశాల ప్రభుత్వాలు నేరుగా (టైర్-1) చర్చలు జరపట్లేదు. అయితే, కొలంబోలో (శ్రీలంక) ఇటీవల భారత్, పాక్‌కు చెందిన కొందరు రిటైర్డ్ మిలిటరీ, దౌత్య అధికారులు, రాజకీయ నాయకుల సమక్షంలో ఇరు దేశాల అధికారులు సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ చర్చలను ట్రాక్-1.5గా వర్ణిస్తూ కథనాలు వచ్చాయి. దీంతో, అసలు ఏం జరిగిందనేదానిపై సస్పెన్స్ నెలకొంది.


ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత్‌తో దౌత్య సంబంధాలను పాక్ కుదించిన విషయం తెలిసిందే. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత సంబంధాలు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి. పాక్‌కు బుద్ధి వచ్చేలా భారత్ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని కూడా పక్కన పెట్టింది. నీళ్లు, రుధిరం కలిసి ప్రవహించలేవని ప్రధాని మోదీ అప్పట్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

ముంబైలో భారీ కుట్ర భగ్నం.. ఎలుకల మందున్న 15 వేల గుళికలు స్వాధీనం

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు.. మరో చార్జ్ షీటు దాఖలు చేసిన ఎన్‌ఐఏ

Updated Date - Jun 27 , 2026 | 09:27 PM