Share News

వామ్మో.. ఈ టీసీ ఎంత పొడవున్నారో చూస్తే..

ABN , Publish Date - Feb 11 , 2026 | 09:15 PM

ముంబై లోకల్ రైళ్లల్లో విధులు నిర్వర్తించే ఓ టిక్కెట్ కలెక్టర్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆయన పొడవు చూసి అంతా షాకైపోతున్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి అని మరికొందరు కామెంట్ చేశారు.

వామ్మో.. ఈ టీసీ ఎంత పొడవున్నారో చూస్తే..
Viral TC Video

ఇంటర్నెట్ డెస్క్: ముంబై నగరానికి జీవనాడి అక్కడి లోకల్ రైల్వే వ్యవస్థ. నిత్యం లక్షల మంది ముంబై లోకల్ రైళ్లల్లో తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. ఈ రైళ్లకు సంబంధించి నిత్యం ఏదోక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఆ రైల్లో ఓ టిక్కెట్ కలెక్టర్ ఉదంతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ టీసీ వీడియోను చూసిన జనాలు షాకైపోతున్నారు. కొందరు ఆయన ఎవరో గుర్తుపట్టి ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు (Mumbai TC Viral Video).

అవినాశ్ మోహితే అనే వ్యక్తి ఇన్‌‌స్టాలో ఆ టీసీ వీడియోను షేర్ చేశారు. రైల్లో ప్రయాణికుల టిక్కెట్లను ఆయన చెక్ చేస్తుండగా తీసిన వీడియో ఇది. టీసీ చాలా పొడవు ఉన్నారని అవినాశ్ తెలిపారు. ఆయనను చూస్తుంటే ఒకప్పటి డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ ది గ్రేట్ ఖలీ గుర్తుకు వస్తారని కామెంట్ చేశారు. ఆయనకు టిక్కెట్ కూడా సలాం చేయాల్సిందే అని కామెంట్ చేశారు. టిక్కెట్ లేని వారు ఆయనను చూస్తే వణికిపోవాల్సిందే అని కూడా అన్నారు.


ఇక ఈ వీడియో చూస్తుండగానే నెట్టింట వైరల్‌గా మారింది. అనేక మంది టీసీ పొడవు చూసి ఆశ్చర్యపోయారు. కొందరు ఆయనను గుర్తుపట్టారు. ‘ఆయన కళ్యాణ్ ఏసీ రైల్లో ఉదయం పూట ఎక్కువగా కనిపిస్తుంటారు. చాలా మంచి వ్యక్తి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఆయనను మేము 1997 నుంచీ చూస్తున్నాము. అప్పట్లో యంగ్‌గా ఉండే వారు. హార్బర్ రైళ్లల్లో ఎక్కువగా కనిపించే వారు’ అని మరో వ్యక్తి చెప్పుకొచ్చారు. ఓసారి రైల్వే స్టేషన్‌లో తనకు ఇబ్బంది ఎదురైతే ఆయన సాయం చేశారని మరో వ్యక్తి చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


ఇవీ చదవండి:

అప్పటి వరకూ పాడేదే లేదు.. స్టేజ్‌పై ప్రముఖ గాయని అల్టిమేటమ్

ఏంటీ..!? ఎయిర్‌పోర్టులో టీ రూ.10, సమోసా రూ.20.. జనాలు షాక్

Updated Date - Feb 11 , 2026 | 09:23 PM