Share News

కదిలే రైలులో గార్బా డ్యాన్స్.. వీడియో వైరల్

ABN , Publish Date - Oct 14 , 2026 | 01:54 PM

శరన్నవరాత్రుల సందర్భంగా ముంబైలోని లోకల్ ట్రైన్‌లో కొందరు మహిళలు గార్బా నృత్యాన్ని ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

కదిలే రైలులో గార్బా డ్యాన్స్.. వీడియో వైరల్
Garba Dance

ఇంటర్నెట్ డెస్క్: శరన్నవరాత్రుల సందర్భంగా ముంబైలోని లోకల్ ట్రైన్‌లో కొందరు మహిళలు గార్బా నృత్యాన్ని ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎర్రటి వస్త్రాలు ధరించిన ఆ మహిళలు జానపద కళారూపాన్ని ప్రదర్శించారు. సాధరణంగా నవరాత్రుల్లో భక్తి పాటలు పాడుతూ, అమ్మవారిని స్మరిస్తూ గార్బా నృత్యంలో మహిళలు పాల్గొంటారు. ఇది గుజరాత్, మహారాష్ట్రల్లో ప్రాచుర్యం పొందింది. అయితే రైలులో గార్బా డ్యాన్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.


నవరాత్రుల్లో మూడోరోజు ఎరుపు రంగు ప్రత్యేకమైంది. అందుకే ఈ మహిళలు ఎర్రటి దుస్తులతో గార్బాలో పాల్గొన్నారు. ‘పావగఢ్ వాలి మన దర్శన్ దే’ అంటూ భక్తిపాటకు ఆడిపాడారు. వారి ప్రయాణానికి ఆధ్యాత్మికతను జోడించారు. కాగా ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే వివరాలు తెలియలేదు. ఈ దృశ్యాలు చూసిన కొందరు విమర్శిస్తుంటే, ఇంకొందరు ప్రశంసిస్తున్నారు.


ఈ వార్తలూ చదవండి

ఇన్‌ఫ్లుయెన్సర్‌‌తో ఆడుకున్న ఫాలోవర్లు.. స్వీట్ల కోసం అడ్రస్ పెడితే.. భారీగా ఆర్డర్లు!

ఝాన్సీలో ఓవర్‌బ్రిడ్జిపై ప్రమాదకర బైక్ స్టంట్లు.. వీడియో వైరల్

Updated Date - Oct 14 , 2026 | 02:09 PM