Share News

లిఫ్ట్‌లో భయానక ఘటన.. బాలికపై దాడి చేసిన పెంపుడు కుక్క..

ABN , Publish Date - Jul 18 , 2026 | 07:10 AM

మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో ఓ కుక్క బాలికపై దాడికి దిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు లిఫ్ట్‌‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

లిఫ్ట్‌లో భయానక ఘటన.. బాలికపై దాడి చేసిన పెంపుడు కుక్క..
Mumbai lift dog attack

ఇంటర్‌నెట్ డెస్క్: మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో ఓ కుక్క బాలికపై దాడికి దిగింది. కుక్క నోటికి బాస్కెట్ మజిల్ ( కుక్కలు మనుషులపై దాడి చేయకుండా ఉండేందుకు నోటికి దీన్ని కడతారు) ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే ఊహించని దారుణం జరిగేది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ముంబైలోని మలద్ వెస్ట్ ఏరియాలో షేత్ ఐరీన్ టవర్ అపార్ట్‌మెంట్ ఉంది. శుక్రవారం ఓ ముగ్గురు బాలికలు ఆ అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్ ఎక్కారు.


కొద్దిసేపటి తర్వాత ఓ మహిళ తన పెంపుడు కుక్కతో లిఫ్ట్ ఎక్కింది. ఆ కుక్క లిఫ్ట్ లోపల ఉన్న ఓ బాలికను చూడగానే ఆగ్రహానికి గురైంది. బాలికపై దాడి చేయటం మొదలెట్టింది. డోర్స్ క్లోజ్ అవ్వకముందే ఇద్దరు బాలికలు లిఫ్ట్ నుంచి తప్పించుకుని పారిపోయారు. బాధిత బాలిక మాత్రం తప్పించుకోలేకపోయింది. కుక్క ఆ బాలికపై విచక్షణా రహితంగా దాడి చేసింది. కుక్క ముఖానికి బాస్కెట్ మజిల్ ఉండటంతో బాలికకు పెద్దగా గాయాలు కాలేదు. లిఫ్ట్ డోర్స్ తెరుచుకోగానే బాలిక అక్కడినుంచి పారిపోయింది. యాజమాని నుంచి తప్పించుకుని బాలిక వెంట పడ్డానికి కుక్క విశ్వ ప్రయత్నం చేసింది.


యాజమాని ఆ కుక్క మెడకు ఉన్న తాడును గట్టిగా పట్టుకుని దాన్ని అక్కడినుంచి ముందుకు వెళ్లనివ్వలేదు. మళ్లీ దాన్ని లిఫ్ట్‌లోకి తీసుకురావడానికి ఆ మహిళా యాజమాని చాలా ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు లిఫ్ట్‌‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కుక్క నోటికి బాస్కెట్ మజిల్ కట్టిన ఆ మహిళా యాజమానిపై కొంతమంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘కుక్కను ఇలాగేనా పెంచేది’ అంటూ మరి కొంతమంది ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

పెట్టుబడులకు అనుకూలతలో రాష్ట్రానికి 10వ ర్యాంకు

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

Updated Date - Jul 18 , 2026 | 07:25 AM