కారులో ఐఫోన్ మర్చిపోయిన కస్టమర్.. క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడంటే..
ABN , Publish Date - Aug 12 , 2026 | 07:07 AM
ఓ క్యాబ్ డ్రైవర్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ఓ వృద్ధ కస్టమర్ క్యాబ్‌లో ఐఫోన్ మర్చిపోగా.. క్యాబ్ డ్రైవర్ దాన్ని భద్రంగా తిరిగిచ్చేశాడు. డ్రైవర్ నిజాయితీకి మెచ్చిన ఆ వృద్ధ కస్టమర్ నగదు బహుమతి ఇచ్చి సత్కరించాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఓ క్యాబ్ డ్రైవర్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ఓ వృద్ధ కస్టమర్ క్యాబ్‌లో ఐఫోన్ మర్చిపోగా.. క్యాబ్ డ్రైవర్ దాన్ని భద్రంగా తిరిగిచ్చేశాడు. డ్రైవర్ నిజాయితీకి మెచ్చిన ఆ వృద్ధ కస్టమర్ నగదు బహుమతి ఇచ్చి సత్కరించాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన మీర్ షేక్ అనే యువకుడు క్యాబ్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఓ వృద్ధుడు క్యాబ్ ఎక్కాడు. గమ్యస్థానం చేరిన ఆ పెద్దాయన ఐఫోన్ 16ను క్యాబ్‌లోనే మర్చిపోయి దిగాడు.
క్యాబ్‌లో ఐఫోన్‌ను గుర్తించిన మీర్ షేక్ దాన్ని యజమానికి తిరిగివ్వాలని అనుకున్నాడు. అయితే, క్యాబ్ ప్లాట్‌ఫారమ్ నుంచి ఆ కస్టమర్‌కు ఫోన్ చేయటం కష్టమైన పని కావటంతో.. ఐఫోన్‌కు ఇన్ కమింగ్ కాల్ వచ్చే వరకు ఆగాడు. కొంత సేపటి తర్వాత వృద్ధుడు తన ఐఫోన్‌కు కాల్ చేశాడు. మీర్ షేక్ కాల్ లిఫ్ట్ చేసి విషయం చెప్పాడు. ఆ వృద్ధుడు ఓ అడ్రస్ చెప్పి ఫోన్‌ను అక్కడికి తీసుకురమ్మన్నాడు. మీర్ షేక్ కస్టమర్ చెప్పిన చోటుకు వెళ్లి ఫోన్‌ను తిరిగిచ్చాడు. పోగొట్టుకున్న ఖరీదైన ఫోన్ తిరిగి తన దగ్గరకు రావటంతో వృద్ధుడు ఎంతో సంతోషించాడు.
మీర్ షేక్ కష్టాన్ని గుర్తించి 2,500 రూపాయలు బహుమతిగా ఇచ్చాడు. మీర్ షేర్ దీన్నంతా వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘మానవత్వం ఇంకా బతికే ఉంది. మీర్ షేక్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ’..‘మీర్ షేక్ మీరు నిజంగా మంచి వారు’..‘క్యాబ్ డ్రైవర్‌కు సెల్యూట్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
చేయి చేయి కలిపారు.. బెడ్ డ్యాం బాగుచేశారు!