Share News

యూట్యూబ్‌లో మిస్టర్ బీస్ట్ చరిత్ర.. 50 కోట్ల సబ్‌స్ర్కైబర్లు దాటేశాడు..

ABN , Publish Date - Jun 13 , 2026 | 01:44 PM

ఎక్కువ మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్న క్రియేటర్‌గా మిస్టర్ బీస్ట్‌పై యూట్యూబ్‌లో ఓ రికార్డ్ ఉంది. ఆ రికార్డును ఇప్పటి వరకు ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. మిస్టర్ బీస్ట్ తన రికార్డులను తానే బ్రేక్ చేస్తున్నాడు. తాజాగా మరో కొత్త రికార్డును సృష్టించాడు.

యూట్యూబ్‌లో మిస్టర్ బీస్ట్ చరిత్ర.. 50 కోట్ల సబ్‌స్ర్కైబర్లు దాటేశాడు..
500 Million Subscribers

ఇంటర్‌నెట్ డెస్క్: సోషల్ మీడియా వాడే వారికి మిస్టర్ బీస్ట్‌తో పెద్దగా పరిచయం అక్కర్లేదు. విభిన్నమైన తన కంటెంట్‌తో మిస్టర్ బీస్ట్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్నాడు. యూట్యూబ్‌లో మిస్టర్ బీస్ట్ ఓ సంచలనమనే చెప్పాలి. యూట్యూబ్‌లో ఎవ్వరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులను అతడు క్రియేట్ చేశాడు. ఎక్కువ మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్న క్రియేటర్‌గా మిస్టర్ బీస్ట్‌పై యూట్యూబ్‌లో ఓ రికార్డ్ ఉంది. ఆ రికార్డును ఇప్పటి వరకు ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. మిస్టర్ బీస్ట్ తన రికార్డులను తానే బ్రేక్ చేస్తున్నాడు. తాజాగా మరో కొత్త రికార్డును సృష్టించాడు.


ఏకంగా 500 మిలియన్ల సబ్‌స్క్రైబర్లను(50 కోట్ల సబ్‌స్ర్కైబర్లు) సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోనే అత్యధిక సబ్‌స్ర్కైబర్లు కలిగిన వ్యక్తిగత యూట్యూబర్‌గా మిస్టర్‌ బీస్ట్‌ నిలిచాడు. కాగా, అమెరికాకు చెందిన మిస్టర్ బీస్ట్ అసలు పేరు జిమ్మీ డోనాల్డ్‌సన్. 2012లో మిస్టర్ బీస్ట్ తన యూట్యూబ్ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు. ఐదు సంవత్సరాల పాటు యూట్యూబ్‌లో సక్సెస్ రాలేదు. 2017నుంచి అతడి జీవితం మారిపోయింది. యూట్యూబ్‌లో నెంబర్ స్థానానికి ఎదిగాడు. వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.


ఇవి కూడా చదవండి

జహీరాబాద్‌లో దారుణం.. కుటుంబ కలహాలతో గర్భిణి ఆత్మహత్య

హైదరాబాద్‌లో యూట్యూబర్ దారుణ హత్య.. ఇంట్లోకి చొరబడి మరీ..

Updated Date - Jun 13 , 2026 | 02:46 PM