Share News

సైకిల్‌కు బైక్ ఇంజిన్.. ఈ యువ మెకానిక్‌ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా!

ABN , Publish Date - Nov 04 , 2026 | 12:07 PM

పాత సైకిల్‌కు మోటార్‌సైకిల్ ఇంజిన్ అమర్చి వినూత్న ప్రయోగం చేశాడో ఓ యువ మెకానిక్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

సైకిల్‌కు బైక్ ఇంజిన్.. ఈ యువ మెకానిక్‌ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా!
Motorcycle Engine Bicycle

ఇంటర్నెట్ డెస్క్: భారతీయుల తెలివితేటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న వస్తువులతోనే అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతున్నాయి.

ఓ యువ మెకానిక్ చేసిన వింత ప్రయోగం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా సైకిల్ అంటే పెడల్స్ తొక్కుతూ నడిపేది. కానీ ఈ యువకుడు మాత్రం పాత సైకిల్‌కు ఏకంగా మోటార్‌సైకిల్ ఇంజన్‌ను అమర్చాడు. దీంతో చూడటానికి సాధారణ సైకిల్‌లా కనిపించే వాహనం కాస్తా మోటార్‌తో నడిచే వాహనంగా మారిపోయింది. వైరల్ వీడియోలో ఆ యువకుడు తన వినూత్న వాహనాన్ని స్టార్ట్ చేయడం కనిపిస్తుంది. ఇంజన్ స్టార్ట్ కాగానే భారీ శబ్దంతో గర్జిస్తూ వెనుక చక్రం వేగంగా తిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన సృజనాత్మకతతో పాత సైకిల్‌ను ఇలా మార్చిన యువకుడి ప్రతిభను చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


యువ మెకానిక్‌ టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!

సాధారణంగా ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని భావిస్తుంటారు. అయితే.. ఈ యువకుడు అందుబాటులో ఉన్న వస్తువులతోనే సరికొత్త ప్రయోగం చేసి చూపించాడు. వనరులు పరిమితంగా ఉన్నా సృజనాత్మకత, నైపుణ్యం ఉంటే వినూత్న ఆలోచనలకు కొదవ లేదని ఈ వీడియో మరోసారి గుర్తుచేస్తోంది.

ఈ వీడియో 'దిల్‌ఖుష్‌కుమార్214' అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘'బడ్జెట్ సూపర్‌బైక్' అని, ‘ఇది నిజమైన దేశీ టాలెంట్’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మళ్లీ స్వల్పంగా పెరిగిన బంగారం ధర

బీఆర్‌ఎస్‌ గుర్తింపు రద్దు చేయాలి

Read Latest AP News And Telangana News

Updated Date - Nov 04 , 2026 | 02:00 PM