Share News

పట్ట పగలు రైల్వే స్టేషన్‌లో సెల్‌ఫోన్ దొంగతనం.. వాళ్లను టార్గెట్ చేసి..

ABN , Publish Date - May 02 , 2026 | 12:46 PM

ఓ దొంగ పట్టపగలు రైల్వే స్టేషన్‌లో దొంగతనం చేశాడు. తాగి నిద్రపోతున్న వ్యక్తి జేబునుంచి సెల్‌ఫోన్ కొట్టేశాడు. ఈ సంఘటన మహరాష్ట్రలో చోటుచేసుకుంది.

పట్ట పగలు రైల్వే స్టేషన్‌లో సెల్‌ఫోన్ దొంగతనం.. వాళ్లను టార్గెట్ చేసి..
Mumbai mobile theft

ఇంటర్‌నెట్ డెస్క్: ఓ దొంగ పట్టపగలు రైల్వే స్టేషన్‌లో దొంగతనం చేశాడు. తాగి నిద్రపోతున్న వ్యక్తి జేబునుంచి సెల్‌ఫోన్ కొట్టేశాడు. ఈ సంఘటన మహరాష్ట్రలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ముంబైలోని నాయ్‌గావ్ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో ప్లాట్‌ఫామ్‌ మీద ఉన్న అరుగుపై నిద్రపోతున్నాడు. ఇంతలో ఓ యువకుడు నిద్రపోతున్న వ్యక్తి దగ్గరకు వచ్చాడు. అతడి జేబులోనుంచి సెల్‌ఫోన్ తీసుకుని అక్కడినుంచి పరారయ్యాడు. పక్క ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు.


ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న కొంతమంది నెటిజన్లు వీడియో తీసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో తీసే బదులు దొంగను అడ్డుకోవచ్చు కదా అంటూ మండిపడుతున్నారు. మరికొంతమంది.. ‘తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయే వాళ్లకు ఇలానే కావాలి’..‘ప్రతీ స్టేషన్‌లో ఇలానే జరుగుతోంది. దొంగలు తాగుబోతులను టార్గెట్ చేస్తున్నారు. వారినుంచి విలువైన వస్తువులు దోచేస్తున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

గుత్తి మీదుగా తిరుపతికి రెగ్యులర్‌ రైలు

అమెరికా దిగ్బంధనం.. ఇరాన్‌కు రూ.45 వేల కోట్ల నష్టం..

Updated Date - May 02 , 2026 | 01:08 PM