Mobile Phone: మొబైల్ ఫోన్ నీటిలో పడి పనిచేయడం లేదా.. ఇలా చేయండి
ABN , Publish Date - Jan 08 , 2026 | 08:57 PM
మొబైల్ ఫోన్ చేతిలో లేకుంటే గంట గడవని పరిస్థితి ఇప్పటి జనాలది. అప్పటివరకూ చక్కగా పనిచేసే అలాంటి ఫోన్ అకస్మాత్తుగా నీటిలో పడిపోయి పనిచేయకుండా ఉంటే మనసు ఉసూరుమనిపోదూ, ఇలాంటి కీలకమైన సమయంలో కంగారు పనులు చేయకుండా.. చేయాల్సినవేమిటో చూడండి.
ఆంధ్రజ్యోతి, జనవరి 8: స్మార్ట్‌ఫోన్ నీటిలో పడిపోయి తడిసిపోతే చాలా మంది పానిక్ అవుతారు. కానీ ఆ తొందరలో చేసే కొన్ని సాధారణ తప్పుల వల్ల ఫోన్ పూర్తిగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. తాజాగా వచ్చిన యూటిలిటీ టిప్స్ గైడ్ ప్రకారం, ఫోన్ తడిసిన వెంటనే ఈ పనులు అస్సలు చేయకూడదు:
ఫోన్‌ను వెంటనే ఆన్ చేయొద్దు:
లోపల నమీ (మాయిశ్చర్) ఉంటే పవర్ బటన్ నొక్కితే షార్ట్ సర్క్యూట్ అయి మదర్‌బోర్డ్ డ్యామేజ్ అవుతుంది. ఫోన్ శాశ్వతంగా పాడైపోవచ్చు.
చార్జర్‌కు పెట్టొద్దు: తడి ఉన్నప్పుడు చార్జింగ్ పోర్ట్‌లో నీరు ఉంటే కరెంట్ షాక్ లాగ డ్యామేజ్ జరుగుతుంది.
హెయిర్ డ్రైయర్‌తో ఎండబెట్టొద్దు: హాట్ ఎయిర్ వల్ల లోపలి పార్ట్స్ కరిగిపోవచ్చు లేదా నీరు మరింత లోతుగా వెళ్లిపోతుంది.
రైస్‌లో పెట్టొద్దు: ఇది పాత మెథెడ్. రైస్ ధూళి లోపలికి వెళ్లి మరిన్ని సమస్యలు తెస్తుంది.
షేక్ చేసి నీరు కార్చొద్దు: బలంగా షేక్ చేస్తే నీరు స్పీకర్, మైక్ వంటి చోట్ల మరింత లోపలికి చేరుతుంది.
సరైన చర్యలు:
ఫోన్‌ను వెంటనే ఆఫ్ చేసి, డ్రై క్లాత్‌తో తుడిచి, సిలికా జెల్ ప్యాకెట్లతో ఉన్న టైట్ కంటైనర్‌లో 24-48 గంటలు పెట్టండి. లేదంటే, సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లండి. కాని అప్రమత్తతో మెలగండి.
గమనిక: ఈ సలహాలు.. సూచనలు కేవలం అవగాహనకోసమేనని గ్రహించాలి. ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల జాగ్రత్త వహించడం తప్పనిసరని గుర్తించండి.
ఇవి కూడా చదవండి...
ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్ర: సీఎం రేవంత్
ప్రభుత్వాస్పత్రిలో కత్తులతో సైకో హల్‌చల్.. భయంతో రోగుల పరుగులు
Read Latest Telangana News And Telugu News