అరేంజ్డ్ మ్యారేజా లేదా లవ్ మ్యారేజా.. పుట్టిన తేదీతో పెళ్లి భవిష్యత్తు
ABN , Publish Date - May 02 , 2026 | 06:21 PM
పుట్టిన తేదీ ఆధారంగా వివాహ జీవితం ఎలా ఉండబోతుందో సంఖ్యాశాస్త్రం చెబుతోంది. ప్రేమ వివాహమా లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా అనే విషయంపై పుట్టిన తేదీ సంఖ్య కొన్ని సూచనలు ఇస్తుందని నిపుణులు అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సంఖ్యాశాస్త్రం ప్రకారం.. పుట్టిన తేదీలో ఉన్న అంకెలను కలిపితే వచ్చే సంఖ్యను రాడిక్స్ నెంబర్ అంటారు. ఉదాహరణకు 1, 10, 19, 28 తేదీల్లో జన్మించినవారికి రాడిక్స్ నెంబర్ 1గా పరిగణిస్తారు. ఈ రాడిక్స్ నెంబర్ మీ వ్యక్తిత్వం, అలవాట్లు, అభిరుచులను తెలియజేస్తుందని నిపుణులు చెబుతారు. అలాగే దీని ఆధారంగా భవిష్యత్తు గురించి కూడా కొన్ని అంచనాలు వేస్తారు. మీరు ప్రేమ వివాహం చేసుకుంటారా లేదా పెద్దలు కుదిర్చిన వివాహం అవుతుందా అనే విషయం కూడా మీ పుట్టిన సంఖ్యపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
సంఖ్య 1 (1, 10, 19, 28)
ఈ తేదీల్లో పుట్టినవారు గంభీరంగా ఉంటారు. వీరికి పెద్దలు కుదిర్చిన వివాహం మంచిదని నిపుణులు చెబుతారు. ప్రేమ వివాహం అంతగా కలిసిరాకపోవచ్చు.
సంఖ్య 2 (2, 11, 20, 29)
ఈ సంఖ్య గల వ్యక్తులు భావోద్వేగంగా ఉంటారు. ప్రేమ వివాహాలు వీరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
సంఖ్య 3 (3, 12, 21, 30)
ఈ సంఖ్య వారికి పెద్దలు కుదిర్చిన వివాహం ఎక్కువగా మంచిది. ప్రేమ వివాహం అంత విజయవంతం కాకపోవచ్చు.
సంఖ్య 4 (4, 13, 22, 31)
ఈ సంఖ్య గల వ్యక్తులు ప్రేమ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. కానీ ప్రేమ వివాహంలో సమస్యలు రావచ్చు. పెద్దలు కుదిర్చిన వివాహం మంచిదని నిపుణులు చెబుతారు.
సంఖ్య 5 (5, 14, 23)
ఈ సంఖ్య వారికి ప్రేమ వివాహం, పెద్దలు కుదిర్చిన వివాహం రెండూ కలిసి వస్తాయి.
సంఖ్య 6 (6, 15, 24)
ఈ వ్యక్తులు ప్రేమకు ప్రాధాన్యం ఇస్తారు. కానీ పెద్దలు కుదిర్చిన వివాహం ఎక్కువగా మంచి ఫలితాలు ఇస్తుంది.
సంఖ్య 7 (7, 16, 25)
ఈ సంఖ్య గల వారు బాధ్యతగలవారు. పెద్దలు కుదిర్చిన వివాహం ఎక్కువగా విజయవంతం అవుతుంది.
సంఖ్య 8 (8, 17, 26)
ఈ వ్యక్తుల సంబంధాలు కొంచెం క్లిష్టంగా ఉంటాయి. ప్రేమ వివాహంలో సమస్యలు రావచ్చు.
సంఖ్య 9 (9, 18, 27)
ఈ సంఖ్య వారు ప్రేమ కంటే కుటుంబ నిర్ణయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పెద్దలు కుదిర్చిన వివాహం మంచిదని నిపుణులు అంటారు.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇవన్నీ నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.)
Also Read:
SLR బోగీ గురించి ఈ నిజాలు మీకు తెలుసా?
వేసవిలో మొటిమలు, దురదతో ఇబ్బంది పడుతున్నారా? ఈ టిప్స్ మీకోసం
For More Latest News