ముంబై లోకల్ ట్రైన్‌లో అమానుషం.. మహిళపై వ్యక్తి దాడి..
ABN , Publish Date - Aug 07 , 2026 | 01:40 PM
ముంబై లోకల్ ట్రైన్‌లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. సీటు విషయంలో గొడవ కారణంగా ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలిపై దాడి చేశాడు. బెల్ట్‌తో కొడతానంటూ బెదిరింపులకు దిగాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: ముంబై లోకల్ ట్రైన్‌లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. సీటు విషయంలో గొడవ కారణంగా ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలిపై దాడి చేశాడు. బెల్ట్‌తో కొడతానంటూ బెదిరింపులకు దిగాడు. వడాలా వద్ద ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ మహిళ సీటులో కూర్చుని ఉంది. తన ముందు నిల్చుని ఉన్న వ్యక్తిని తిడుతోంది. ఆ వ్యక్తి కూడా ఆమెను తిడుతూ పలుసార్లు కొట్టాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయాడు.
ఆ మహిళ తిట్టడం ఆపకపోవటంతో ఆ వ్యక్తి కోపంగా ఆమె దగ్గరకు వచ్చాడు. బెల్ట్ తీసి ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ కంపార్ట్‌మెంట్‌లో చాలా మంది జనం ఉన్నా.. ఎవ్వరూ కూడా ఆ మహిళకు సాయం రాలేదు. గొడవ ఆపడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఈ సంఘటనపై రైల్వే అధికారులు అధికారికంగా స్పందించలేదు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు ఆ వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రైళ్లలో మహిళలకు రక్షణ లేదని మరి కొందరు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి
గుజరాత్‌లో ప్రజలను భయపెడుతున్న బావి రహస్యం..
ఆసుపత్రి భవనం పెచ్చులూడి మహిళకు తీవ్ర గాయాలు.. వీడియో వైరల్