Share News

స్ట్రీట్‌లైట్ స్తంభంపై కుక్క.. ప్రాణాలకు తెగించి కాపాడిన వ్యక్తి

ABN , Publish Date - Nov 28 , 2026 | 10:04 AM

ప్రమాదంలో చిక్కుకున్న మూగజీవాన్ని కాపాడేందుకు ఓ వ్యక్తి చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎత్తులో ఉన్న వీధి దీపంపై చిక్కుకుపోయిన పెంపుడు కుక్కను రక్షించేందుకు ప్రాణాలకు తెగించి మరీ అతను చేసిన ప్రయత్నం నెటిజన్ల మనసులు గెలుచుకుంటోంది.

 స్ట్రీట్‌లైట్ స్తంభంపై కుక్క.. ప్రాణాలకు తెగించి కాపాడిన వ్యక్తి

ఇంటర్నెట్ డెస్క్: బాల్కనీ నుంచి కిందపడి.. నేలకు చాలా ఎత్తులో స్ట్రీట్‌లైట్ స్తంభంపై చిక్కుకుపోయిన ఓ పెంపుడు కుక్కను రక్షించేందుకు ఓ వ్యక్తి చేసిన సాహసం నెటిజన్ల మనసులు గెలుచుకుంది. కుక్క కిందకు దిగలేక భయంతో వణుకుతుండటాన్ని గమనించిన అతను ఏమాత్రం వెనుకాడకుండా స్ట్రీట్‌లైట్ స్తంభంపైకి ఎక్కాడు. కింద గుమిగూడిన ప్రజలు ఆందోళనగా చూస్తుండగా.. ఎంతో జాగ్రత్తగా కుక్క దగ్గరకు చేరుకుని దాన్ని సురక్షితంగా పట్టుకున్నాడు. అనంతరం దాన్ని చేతుల్లోకి తీసుకుని నెమ్మదిగా కిందకు దిగి.. ఎలాంటి ప్రమాదం జరగకుండా నేలపైకి తీసుకొచ్చాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను 'ఘర్ కే కలేష్' అనే ఎక్స్ ఖాతా షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాగో వేడుకకు వెళ్తున్న సమయంలో ఈ ఘటనను గమనించిన బృందం, కుక్కను రక్షించేందుకు ముందుకొచ్చినట్లు పోస్టులో పేర్కొన్నారు.


మానవత్వానికి నిదర్శనం.. నెటిజన్ల ప్రశంసలు..

కుక్కను సురక్షితంగా కిందకు తీసుకొచ్చిన అనంతరం.. ఆత్రుతగా ఎదురుచూస్తున్న దాని యజమానికి అప్పగించడంతో ఈ ఘటన సంతోషకరమైన ముగింపునకు చేరుకుంది. ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న మూగజీవాన్ని కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకొచ్చిన వ్యక్తి ధైర్యం, సమయస్ఫూర్తి, జంతువుల పట్ల చూపిన కరుణపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'మానవత్వం ఇంకా బతికే ఉంది' అంటూ ఒకరు స్పందించగా.. మరొకరు అతని నిస్వార్థ సేవను కొనియాడుతూ అభినందించారు.


ఈ వార్తలనూ చదవండి:

భారతీయుడి ప్రపంచ రికార్డు.. 10 లక్షల మంది యూట్యూబ్ పెయిడ్ ఛానల్ మెంబర్స్..

ప్రశ్నలు మీవే.. సమాధానాలూ మీవే.. ఐఐటీలో ఇలాంటి పరీక్షలా?

Updated Date - Nov 28 , 2026 | 10:08 AM