బురఖా వేసుకుని లేడీస్ కోచ్‌లోకి ఎక్కిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Feb 08 , 2026 | 01:12 PM
బురఖా ధరించిన ఓ యువకుడు లోకల్ ట్రైన్‌లోని లేడీస్ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కాడు. ఆ కంపార్ట్‌మెంట్‌లోని ఆడవారు బురఖాలో ఉన్నది మహిళ కాదు పురుషుడని గుర్తించటంతో అలజడి మొదలైంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఓ యువకుడు బురఖా ధరించి లోకల్ ట్రైన్‌లోని లేడీస్ కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించాడు. ఆ కంపార్ట్‌మెంట్‌లోని ఆడవారు బురఖాలో ఉన్నది మహిళ కాదు పురుషుడని గుర్తించటంతో అలజడి మొదలైంది. మహిళలు ఆ యువకుడికి తగిన విధంగా బుద్ధి చెప్పారు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగు చూసింది. రైల్వే పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శుక్రవారం బురఖా ధరించిన ఓ యువకుడు లోకల్ ట్రైన్‌లోని లేడీస్ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కాడు. కంపార్ట్‌మెంట్ మొత్తం మహిళలతో నిండిపోయి ఉంది.
ఆ యువకుడు బురఖాలో ఆడవారి మధ్య చప్పుడు చేయకుండా నిల్చుని ఉన్నాడు. అయితే అక్కడున్న కొంతమంది మహిళలకు అనుమానం వచ్చింది. బురఖాలో ఉన్నది మహిళ కాదు.. పురుషుడని వారు భావించి ఆ యువకుడిని నిలదీశారు. కొద్దిసేపు ఏమీ మాట్లాడకుండా అతడు మౌనంగా ఉండిపోయాడు. మహిళలు గట్టిగా నిలదీయడంతో చివరకు ముసుగు తీశాడు. కొంతమంది అతడిని వీడియో తీశారు. మరికొంతమంది పోలీసులకు పట్టిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.
దీంతో భయపడిపోయిన ఆ యువకుడు రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ నుంచి కిందకు దూకేశాడు. ఈ సంఘటనపై మహిళలు ఘట్కోపార్ స్టేషన్‌లో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అతడిని గుర్తించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆ యువకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైళ్లలో కూడా మహిళలకు రక్షణ లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఫుట్‌బాల్ దేశంలో క్రికెట్ క్రేజ్
నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం.. పోలీసులకు ఫిర్యాదు..