ఫోన్ మైకంలో అడుగు వేశాడు.. అంతలోనే ..
ABN , Publish Date - Sep 12 , 2026 | 08:09 AM
మొబైల్ ఫోన్‌పై కాసేపు దృష్టి పెట్టడం.. ఓ వ్యక్తిని ఊహించని ప్రమాదంలోకి నెట్టేసింది. నిర్మాణంలో ఉన్న భవనంలో ఫోన్ చూస్తూ నడుస్తున్న వ్యక్తి.. తన ముందున్న ప్రమాదాన్ని గుర్తించకపోవడంతో అసంపూర్తిగా ఉన్న ఫ్లోరింగ్‌లోకి అడుగుపెట్టి .. పైనుంచి కిందకు పడిపోయాడు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల మొబైల్ ఫోన్ మైకంలో పడి రోడ్డుపై, మెట్లు, రైల్వే స్టేషన్లు, నిర్మాణ ప్రాంతాలు వంటి చోట్ల ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. చేతిలో ఫోన్, చూపు మొత్తం స్క్రీన్‌పైనే ఉండటంతో చుట్టూ ఉన్న ప్రమాదాలను గుర్తించలేక కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో చోటుచేసుకుంది. ఫోన్ చూస్తూ నడుస్తున్న ఓ వ్యక్తి అసంపూర్తిగా ఉన్న ఫ్లోరింగ్ భాగాన్ని గమనించకుండా అడుగు వేశాడు. దీంతో అతను ఒక్కసారిగా పైనుంచి కిందకు పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ చూస్తూ.. నిర్మాణంలో ఉన్న భవనం పై అంతస్తులో నడుస్తున్నాడు. ముందు చూసుకోకుండా ఫోన్ చూస్తూ వెళ్లడంతో.. ఫ్లోరింగ్ మధ్యలో రంధ్రాన్ని గుర్తించలేకపోయాడు. చివరకు దానిపై అడుగు వేయడంతో ఒక్కసారిగా ధబేల్‌మని కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ఈ వీడియోపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఫోన్ పిచ్చి ప్రాణాలు తీస్తుంది’ అని ఒకరు, ‘ఫోన్ చూస్తూ నిర్లక్ష్యంగా ఉంటే.. ఇదే జరుగుతుంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఫోన్ మైకంలో పడితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
ఇవీ చదవండి:
ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో 'బ్రిక్స్' వృద్ధి: మోదీ
పుతిన్-మోదీ ప్రయాణించిన కారు చలించే ఓ ఉక్కుకోట!