Share News

కారులో ఆవును ఎత్తుకెళ్లిన ముఠా.. వైరల్ వీడియో చూస్తే కంగుతినాల్సిందే!

ABN , Publish Date - Jul 29 , 2026 | 04:54 PM

మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్‌లో అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు ఓ ఆవును దొంగిలించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కారులో ఆవును ఎత్తుకెళ్లిన ముఠా.. వైరల్ వీడియో చూస్తే కంగుతినాల్సిందే!
Maharashtra Viral Video

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని పింప్రి గావ్ ప్రాంతంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు దుండగులు కారులో వచ్చి సుమారు రూ.20,000 విలువైన ఆవును కారులో ఎక్కించుకుని ఉడాయించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 28న తెల్లవారుజామున సుమారు 1:45 గంటలకు ఈ చోరీ జరిగింది. వైరల్ అవుతున్న వీడియోలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ ఆవును కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి పారిపోవడం కనిపిస్తోంది.


ఈ ఘటన స్థానికుల్లో ఆందోళన రేకెత్తించింది. ఆవు యజమాని ఫిర్యాదు మేరకు పింప్రి పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అనుమానితులను గుర్తించేందుకు.. చోరీకి ఉపయోగించిన వాహనం ఆచూకీ కోసం సమీప ప్రాంతాలలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీస్ అధికారులు తెలిపారు. ఆవును అమ్మకం, రవాణా లేదా వధ కోసం దొంగిలించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'ఇప్పటివరకు మోటార్ బైక్స్, కార్లు చోరీ చేసేవారు.. ఇప్పుడు మూగ జీవాలను కూడా వదలడం లేదు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

రోహిత్ శర్మను మళ్లీ ఎదుర్కొనే అవకాశం ఉంటుందో లేదో!: జోస్ బట్లర్

టీడీపీ నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దు: పల్లా శ్రీనివాసరావు

Updated Date - Jul 29 , 2026 | 05:19 PM