Share News

టీచరమ్మ వికృత చేష్టలు.. క్లాస్ రూమ్‌లోనే విద్యార్థులతో మసాజ్.. వీడియో వైరల్!

ABN , Publish Date - Mar 07 , 2026 | 03:59 PM

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయురాలు దారి తప్పింది. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సింది పోయి, వాళ్లతో మసాజ్ చేయించుకుంటూ కెమెరా కంటికి చిక్కింది. మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీచరమ్మ వికృత చేష్టలు.. క్లాస్ రూమ్‌లోనే విద్యార్థులతో మసాజ్.. వీడియో వైరల్!
Madhya Pradesh Teacher Viral Video,

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు క్లాస్ రూమ్‌లోనే విద్యార్థినులతో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలిసిన విద్యాశాఖ సదరు ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేసి, ఈ విషయంపై విచారణకు ఆదేశించింది. ఈ సంఘటన కార్వి ప్రాంతంలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగినట్లు తెలుస్తోంది.


వైరల్ వీడియోలో.. తరగతి గదిలో ప్రధానోపాధ్యాయురాలు నేలపై చాపను పరిచి దానిపై పడుకొని ఉండగా, ఒక విద్యార్థిని ఆమె కాళ్లకు మసాజ్ చేయగా, ఒక విద్యార్థిని నడుముపై మసాజ్ చేస్తుంది. మరో విద్యార్థిని చపాతీ కర్రతో మసాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సమయంలో ప్రధానోపాధ్యాయురాలు తన ఫోన్ ఉపయోగిస్తూ ఎంజాయ్ చేస్తోంది. స్థానిక నివేదికల ప్రకారం.. నయా బజార్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మధు రాయ్ అని పేర్కొన్నారు. వైరల్ అయిన వీడియోను విద్యాశాఖ గమనించి పాఠశాలను తనిఖీ చేయడానికి ఒక టీమ్‌ని పంపినట్లు ప్రాథమిక శిక్ష అధికారి (BSA) బికె శర్మ తెలిపారు. తనిఖీలో భాగంగా విద్యార్థినులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తదుపరి విచారణ జరిగే వరకు ప్రధానోపాధ్యాయురాలు సస్పెండ్ చేయబడిందని అన్నారు.


ఇవి కూడా చదవండి...

దుర్గమ్మను ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు: హోం మంత్రి అనిత

మహిళల రక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి: సీఎం రేవంత్

Updated Date - Mar 07 , 2026 | 04:00 PM