Share News

పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..

ABN , Publish Date - Apr 05 , 2026 | 10:52 AM

ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచింది. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది.

పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..
Madhya Pradesh dog attack

భోపాల్, ఏప్రిల్ 5: మధ్య ప్రదేశ్‌లోని కేవ్తీ గ్రామంలో ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచింది. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఇంటి ఆవరణలో ఓ ముగ్గురు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. పిచ్చి కుక్క అటు వైపు వచ్చింది. నేరుగా కుర్చీలో కూర్చున్న వ్యక్తి దగ్గరకు వెళ్లింది. అతడి మీదకు ఎగిరి దూకి దాడి చేయడానికి ప్రయత్నించింది.


అతడు వెంటనే దానినుంచి తప్పించుకున్నాడు. కుర్చీ అడ్డు ఉండంతో అది పక్కకు వచ్చేసింది. మంచంపై కూర్చున్న వ్యక్తిపై దాడి చేయటం మొదలెట్టింది. అతడి కాలును కొరికింది. పక్కన ఉన్న వ్యక్తులు గట్టిగా అరుస్తూ దాన్ని కొట్టడానికి ప్రయత్నించారు. అది పక్కకు పరుగులు తీసింది. ఆ వెంటనే గేటు దగ్గర ఉన్న వ్యక్తి మీదకు ఎగిరి దూకింది. అతడిపై విచక్షణా రహితంగా దాడి చేసింది. ఇంతలో ఓ వ్యక్తి కుర్చీ తీసుకుని దాని మీద దాడి చేయటం మొదలెట్టాడు. అది ఏమాత్రం భయపడలేదు. కుర్చీ విరిగిపోయేలా దెబ్బలు పడ్డా వెనక్కు తగ్గలేదు.


కుర్చీతో దాడి చేసిన వ్యక్తిని కిందపడేసి దాడి చేయసాగింది. మిగితా వాళ్లు రాళ్లతో పిచ్చి కుక్కపై దాడి చేశారు. అది అక్కడినుంచి పారిపోయింది. 20 సెకన్ల ఆ వీడియోలో .. కేవలం 15 సెకన్లలో ఆ పిచ్చి కుక్క నలుగురు వ్యక్తులను గాయపరిచింది. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ మధ్య కాలంలో కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. మనుషులు ధైర్యంగా రోడ్లమీద తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది’..‘ప్రభుత్వం కుక్కల మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్ల హతం.. వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు..

వేసవికాలం.. తాపాన్ని తరిమికొట్టే సింపుల్ చిట్కాలు..

Updated Date - Apr 05 , 2026 | 10:56 AM