ఓరి మీ దుంపలుతెగా.. ఏటీఎం గదిని ఇలా వాడేశారేంటీ..
ABN , Publish Date - Jul 04 , 2026 | 06:53 PM
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ వింత సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తీవ్రమైన ఉక్కపోతను తట్టుకోలేక.. అర్ధనగ్నంగా మారిన ఇద్దరు వ్యక్తులు ఏటీఎం గదిలోకి వెళ్లి నిలబడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. జనాల దృష్టిని ఆకర్షించేలా ఏ చిన్న వింత కనిపించినా, వెంటనే దానిని ఫోన్లలో రికార్డ్ చేసి ఇంటర్నెట్‌లోకి వదులుతున్నారు. తాజాగా ఓ వింత ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా ఏటీఎం సెంటర్లకుడబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి వెళ్తాం. లోపల మెషిన్లు వేడెక్కకుండా ఉండేందుకు ఏసీ ఆన్‌లో ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ఇద్దరు వ్యక్తులు మాత్రం ఆ ఏసీని సరికొత్తగా వాడుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో నవ్వులు పూయిస్తోంది. వైరల్ వీడియోలో.. ఏటీఎం సెంటర్ లోపల ఇద్దరు వ్యక్తులు అర్ధనగ్నంగా నిలబడి ఉన్నారు. బయట ఉక్కపోతను తట్టుకోలేక.. ఏటీఎం రూమ్‌లో ఏసీ కింద ఉపశమనం పొందారు. ఆ సమయంలో వారిని గమనించిన వారు.. ఫోన్లలో వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని లాల్‌బాగ్ ప్రాంతంలో గల ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో జరిగినట్లు పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘టెక్నాలజీని అసలైన పద్ధతిలో ఇప్పుడే వాడారు’అని ఒకరు కామెంట్ చేయగా.. ’అసలు వీరికి ఎంత హాయిగా ఉందో కదా’ అని మరొకరు రాసుకొచ్చారు. ’ ఈ ఎండల్లో ఏటీఎం రూమ్‌ను సరైన రీతిలో ఉపయోగించుకున్నది వీరే’ అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఆస్పత్రిలో 6 రోజుల పసికందును వదిలేసి తల్లిదండ్రుల పరార్
చిన్నారులకు ప్రాణం పోస్తున్న సత్యసాయి ఆస్పత్రి.. విజయ్, హరీశ్ ప్రశంసలు
Read Latest Telangana News And Telugu News