Share News

లవ్ అండ్ వార్ సినిమా షూటింగ్‌లో విషాదం.. సినీ కార్మికుడి కన్నుమూత..

ABN , Publish Date - Jun 21 , 2026 | 09:52 PM

‘లవ్ అండ్ వార్’ సినిమా షూటింగ్ సందర్భంగా కొద్దిరోజుల క్రితం ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ సినీ కార్మికుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు.

లవ్ అండ్ వార్ సినిమా షూటింగ్‌లో విషాదం.. సినీ కార్మికుడి కన్నుమూత..
Love and War set accident

ముంబై, జూన్ 21: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీల బన్సాలీ నిర్మాణంలో ‘లవ్ అండ్ వార్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరా వేగంగా సాగుతోంది. షూటింగ్ సందర్భంగా కొద్దిరోజుల క్రితం ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ సినీ కార్మికుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. జూన్ 17వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


రాయల్ పంప్ స్టూడియోలో జరిగిన ప్రమాదంలో చంద్రధరి యాదవ్ చనిపోయాడు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అతడు చనిపోయినట్లు తెలుస్తోంది. ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు చిత్ర నిర్మాత సంజయ్ లీల భన్సాలిని సంప్రదించారు. మరణించిన కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం, మద్దతు అందించాలని అభ్యర్థించారు. యాదవ్ కుటుంబానికి పరిహారంగా భన్సాలీ ప్రొడక్షన్స్ 40 లక్షల రూపాయలు అందించినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి

రామాలయ విరాళాల చోరీపై చర్యలేవి?: అరవింద్ కేజ్రీవాల్

నా లైఫ్‌లో ఒక ఇండియన్, ఒక పాకిస్థానీ అత్యంత ముఖ్యులు.. జేడీ వాన్స్ సరదా కామెంట్

Updated Date - Jun 21 , 2026 | 09:56 PM