రోడ్డు పక్కన వ్యాన్‌లో.. కూరగాయల్లా కప్పల అమ్మకం.. వీడియో వైరల్
ABN , Publish Date - May 23 , 2026 | 12:23 PM
మార్కెట్‌లో కూరగాయలు, పండ్లు, చికెన్ లేదా మటన్ కిలోల లెక్కన అమ్మడం సర్వసాధారణం. కానీ బతికి ఉన్న కప్పలను కుప్పలుగా పోసి విక్రయించడం ఎక్కడైనా చూశారా. తాజాగా, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది..
ఇంటర్నెట్ డెస్క్: మార్కెట్‌లో కూరగాయలు, పండ్లు, చికెన్ లేదా మటన్ కిలోల లెక్కన అమ్మడం సర్వసాధారణం. . కానీ, ఎప్పుడైనా బహిరంగ మార్కెట్లో బతికున్న కప్పలను కుప్పలుగా పోసి అమ్మడం చూశారా? వినడానికి కాస్త వింతగా అనిపించినా.. ఇది అక్షరాలా నిజం! మార్కెట్లో కూరగాయలు అమ్మినట్లుగా బతికున్న కప్పలను విక్రయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ప్రజలు రోడ్డు పక్కన ఆపి ఉన్న ఒక మినీ వ్యాన్ వద్ద గుంపుగా చేరి, బతికున్న కప్పలను ఎగబడి కొనుగోలు చేయడం కనిపిస్తోంది. వ్యాన్ వెనుక భాగంలో వందల సంఖ్యలో బతికున్న కప్పలను ఉంచారు. అవి బయటకు దూకకుండా ఒక నెట్ లాంటిది ఏర్పాటు చేశారు. మార్కెట్లో కూరగాయలను కిలోల లెక్కన త్రాసులో తూకం వేసినట్లు.. అక్కడ వ్యాన్ యజమాని కప్పలను చేత్తో పట్టుకుని త్రాసులో వేసి కిలోల లెక్కన అమ్ముతున్నారు. కొనుగోలుదారులు వాటిని కవర్లలో వేయించుకుని ఇళ్లకు తీసుకెళ్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్ ధరల ర్యాలీకి బ్రేక్.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
మా వాట్సాప్ గ్రూప్‌లోనూ వైభవ్ గురించే చర్చిస్తున్నాం