IIT బాంబే క్యాంపస్‌లో చిరుతపులి కలకలం.. కుక్కపై దాడి చేసి..
ABN , Publish Date - Jun 20 , 2026 | 01:50 PM
ముంబైలోని ఐఐటీ బాంబే క్యాంపస్‌లో చిరుతపులి కలకలం రేపింది. స్టాఫ్ హాస్టల్ ఏరియాలో ఓ కుక్కపై దాడి చేసింది. కుక్క గొంతును కొరికి చంపేసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ముంబైలోని ఐఐటీ బాంబే క్యాంపస్‌లో చిరుతపులి కలకలం రేపింది. స్టాఫ్ హాస్టల్ ఏరియాలో ఓ కుక్కపై దాడి చేసింది. కుక్క గొంతును కొరికి చంపేసింది. అనంతరం దాన్ని అక్కడినుంచి లాక్కెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావటంతో క్యాంపస్‌లోని విద్యార్థులు, కాలేజీ స్టాఫ్‌తో పాటు స్థానిక ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. క్యాంపస్ ఏరియాలో ప్రజలకు, పెంపుడు జంతువులకు రక్షణ లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి దారుణంగా ఉంటోందని అంటున్నారు.
ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ కుక్క మెట్ల దగ్గర నిల్చుని ఉంది. చిరుతపులి నడుచుకుంటూ కుక్క దగ్గరకు వచ్చింది. కుక్క ఆ చిరుతపులిని ముందే చూసినా భయపడలేదు. అక్కడినుంచి పారిపోలేదు. కుక్క దగ్గరకు వచ్చిన వెంటనే చిరుతపులి దానిపై దాడి చేసింది. దాని గొంతు పట్టుకుని కొరికి చంపేసింది. తర్వాత దాన్ని అక్కడినుంచి తీసుకెళ్లిపోయింది. ఇదంతా కేవలం 30 సెకన్లలోనే జరిగింది.
ఇవి కూడా చదవండి
కాల్పుల విరమణకు తూట్లు.. లెబనాన్‌పై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు
హైదరాబాద్ టూ గోవా టూర్.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ!