కార్పొరేట్ జాబ్ పోవడంతో.. అంట్లు తోమే పనిలో చేరి..
ABN , Publish Date - Aug 30 , 2026 | 08:20 AM
కార్పొరేట్ జాబ్ పోవడంతో ఓ 29 ఏళ్ల యువకుడు చివరకు అంట్లు తోమే పనిలో చేరిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తే మనసుపై పడే ప్రతికూల ప్రభావం మాటల్లో చెప్పడం కష్టం. ఇదే వేదన అనుభవించిన ఓ 29 ఏళ్ల యువకుడు చివరకు అంట్లు తోమే పనిలో చేరిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఏప్రిల్‌లో తన ఉద్యోగం పోయిందని అతడు చెప్పుకొచ్చాడు. లేఆఫ్స్‌కు పరిహారంగా 9 నెలల జీతం ఇచ్చారని చెప్పాడు. అంతేకాకుండా, ఉద్యోగం చేస్తున్న సమయంలో తాను కొంత పొదుపు చేసుకున్న విషయాన్ని కూడా తెలిపాడు. ఇప్పటిరకూ వందల కొద్దీ ఉద్యోగాలకు అప్లై చేసినా, ఇంటర్వ్యూలకు హాజరైనా మరో ఉద్యోగం మాత్రం దొరకలేదని అన్నాడు.
‘నా మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. ప్రపంచం తలకిందులు అయిపోయినట్టు, నా జీవితం నిరర్థకంగా మారిందని అనిపించింది. నాలుగు నెలలుగా జాబ్ లేకుండా ఉన్నాను. కార్పొరేట్ జాబ్ నాకున్న గుర్తింపు అన్న భావన నుంచి బయటపడలేకపోతున్నాను. అసలు నాకు కార్పొరేట్ జాబ్స్ నచ్చవు. కానీ ఇప్పుడు ఆ జాబ్ లేకపోతే నాతో ఎవరికీ ఏ ఉపయోగం లేదన్న భావన వచ్చేసింది’

‘ఉద్యోగం లేకున్నా మరో ఐదేళ్ల పాటు హ్యాపీగా ఉండేంత డబ్బు నాకు ఉంది. అయినప్పటికీ గంటకు 11 డాలర్ల జీతంపై అంట్లు తోమే పనిలో చేరాను. డబ్బు కోసం ఈ పనికి ఒప్పుకోలేదు. నా వల్ల జనాలకు ఉపయోగం ఉందన్న భావనతో ఈ పనికి ఒప్పుకున్నాను. దీంతో, నా దినచర్య కొంతవరకైనా గాడిలో పడుతుందని భావిస్తున్నాను. భవిష్యత్తుపై ఆందోళన నుంచి కొంతవరకైనా ఉపశమనం దక్కుతుందని అనుకుంటున్నాను’ అని చెప్పాడు. ఈ అనుభవంతో రిటైర్‌మెంట్ అంటే ఏంటో అర్థమైందని కూడా చెప్పాడు. తనకు భవిష్యత్తులో కావాల్సినంత డబ్బు వచ్చినప్పటికీ ఖాళీగా ఉండబోనని చెప్పాడు.
ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. లేఆఫ్స్ తరువాత నైరాశ్యం నుంచి బయటపడేందుకు తామూ రకరకాల జాబ్స్ చేశామని అనేక మంది చెప్పారు. జీతం కంటే జీవితం ఓ క్రమపద్ధతిలో సాగిపోవడాన్ని ఆస్వాదించే వారు ఉద్యోగాలు చేస్తుంటారని కొందరు అభిప్రాయపడ్డారు.
ఈ వార్తలనూ చదవండి:
మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లిన పోలీస్.. మండిపడుతున్న నెటిజన్లు..
ఈ బస్సు క్లీనర్ నిజంగా దేవుడే.. వృద్ధుడిని ఎలా కాపాడాడో చూడండి..