Share News

మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లిన పోలీస్.. మండిపడుతున్న నెటిజన్లు..

ABN , Publish Date - Aug 29 , 2026 | 06:46 PM

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్ అధికారి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మహిళను చేతులపై మోస్తూ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెకు దగ్గరుండి మరీ చికిత్స చేయించారు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం పోలీస్ అధికారి చేసిన పనిని నెటిజన్లు తప్పుబడుతున్నారు.

మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లిన పోలీస్.. మండిపడుతున్న నెటిజన్లు..
UP Inspector viral video

ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్ అధికారి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మహిళను చేతులపై మోస్తూ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెకు దగ్గరుండి మరీ చికిత్స చేయించారు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం పోలీస్ అధికారి చేసిన పనిని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ సంగతేంటంటే..


బహ్రైచ్‌, ఖైరీఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని థాలియా గ్రామం వద్ద శుక్రవారం మధ్యాహ్నం గాయత్రీ దేవి (55) అనే మహిళ రోడ్డు ప్రమాదానికి గురైంది. గాయాల కారణంగా రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడిపోయింది. ఆ సమయంలో పెట్రోలింగ్‌లో ఉన్న ఖైరీఘాట్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌ఛార్జ్ ప్రదీప్ కుమార్ సింగ్ ఆమెను చూశారు. ఆమెను తన చేతులపై మోస్తూ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దగ్గరుండి మరీ మహిళకు వైద్యం చేయించారు.


ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. ‘ఆమెను పోలీస్ జీపులో ఆస్పత్రికి తీసుకెళ్లవచ్చు కదా.. ఎందుకు చేతులపై మోసుకెళ్లటం’.. ‘జీపులో ఎక్కించి తీసుకెళ్తే ఆస్పత్రికి త్వరగా చేరుకోవచ్చు కదా. 'సింగం స్టైల్' బిల్డప్ కోసమే చేతులపై మోసుకెళ్లారా?’.. అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్‌

ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌కు అధిష్టానం బిగ్ షాక్.. పార్టీ నుంచి బహిష్కరణ

Updated Date - Aug 29 , 2026 | 06:47 PM