Share News

బెంగళూరు చెత్త నగరంగా మారింది: పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా

ABN , Publish Date - Jun 28 , 2026 | 04:59 PM

పచ్చదనంతో కళకళలాడాల్సిన బెంగళూరు నగరం సరైన ప్రణాళిక లేక చెత్త నగరంగా మారిందంటూ పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

బెంగళూరు చెత్త నగరంగా మారింది: పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా
Kiran mazumdar on Bengaluru Infrastructure Planning

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరు నగరానికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అయితే, నగరంలో ట్రాఫిక్ రద్దీ, పారిశుధ్య వ్యవస్థ, మౌలిక వసతులకల్పనలో లోపాల కారణంగా కూడా నగర ప్రజలు నిత్యం అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ నగరంలో ఎలాంటి మార్పులు చేయాలో చెబుతూ ఒక పోస్టు పెట్టారు. నిర్వహణ లోపాల కారణంగా బెంగళూరు చెత్త నగరంగా మారిందని అన్నారు.

బెంగళూరు ఎలా ఉండాలో చెబుతూ కిరణ్ మజుందార్ ఒక ఊహాజనిత చిత్రాన్ని షేర్ చేశారు. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్న మరో చిత్రాన్ని షేర్ చేశారు. ‘ఉద్యాన నగరిగా బెంగళూరుకు ఉన్న పేరును ప్రతిబింబించేలా రోడ్లు, ఇతర వ్యవస్థలను డిజైన్ చేయాలి. కానీ దురదృష్ట వశాత్తూ నానాటికీ పచ్చదనం తగ్గిపోతుండటంతో ఇది ఒక చెత్త నగరంగా మారింది’ అని ఆమె కామెంట్ చేశారు.


ఈ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. మజుందార్ అభిప్రాయంతో అనేక మంది ఏకీభవించారు. నగరంలో వ్యర్థాల నిర్వహణ సరిగా లేదని కొందరు అన్నారు. రోడ్లు కూడా అధ్వాన్నంగా ఉన్నాయని మరికొందరు చెప్పారు. పచ్చదనం అంతకంతకూ తగ్గిపోతోందని ఇంకొందరు అన్నారు. నగరాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అటు ప్రభుత్వంతో పాటు ప్రజలపై కూడా ఉందని మరికొందరు అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

క్షణాల్లో ఊహించని దారుణం.. తప్పు ఎవరిది?

పిల్ల కోతి చోరీ.. ఫోన్ తిరిగి ఇచ్చేసిన తల్లి కోతి.. వీడియో వైరల్..

Updated Date - Jun 28 , 2026 | 05:04 PM