క్షణాల్లో ఊహించని దారుణం.. తప్పు ఎవరిది?
ABN , Publish Date - Jun 28 , 2026 | 04:01 PM
బస్సు దిగి రోడ్డు దాటుతున్న ఓ బాలిక ప్రమాదానికి గురైంది. కుడివైపు నుంచి దూసుకువచ్చిన బైకు పాపను ఢీకొట్టింది. దీంతో పాప తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: బస్సు దిగి రోడ్డు దాటుతున్న ఓ బాలిక ప్రమాదానికి గురైంది. కుడివైపు నుంచి దూసుకువచ్చిన బైకు పాపను ఢీకొట్టింది. దీంతో పాప తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. బీద్ జిల్లాలోని గయా నగర్‌కు చెందిన అభిద్య మదివాలే అనే 9 ఏళ్ల చిన్నారి స్థానికంగా ఉండే ఓ స్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. రోజూలాగే శనివారం కూడా స్కూలుకు వెళ్లి స్కూలు బస్సులో ఇంటి దగ్గరకు తిరిగి వచ్చింది. అభిద్య ఇంటికి వెళ్లాలంటే రోడ్డు దాటి వెళ్లాలి. బస్సు రోడ్డు మీద ఆగింది. అభిద్య కిందకు దిగి రోడ్డు దాటడం కోసం పరుగులు తీసింది.
అయితే, పాప కుడి వైపు నుంచి ఓ బైకు వేగంగా దూసుకువచ్చి బాలికను ఢీకొట్టింది. దీంతో బాలిక దూరంగా ఎగిరిపడింది. రోడ్డుపై పడ్డంతో బాలికకు తీవ్రగాయాలు అయ్యాయి. బాలికను ఢీకొట్టిన తర్వాత బైకు ఆగకుండా అక్కడినుంచి దూసుకుపోయింది. కిందపడ్డ బాలికను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పాప ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ట్రాఫిక్ అధికారి వైభవ్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ..
‘ఈ సంఘటన జరగడానికి స్కూల్ బస్ డ్రైవర్, స్టాఫ్‌ను పూర్తి బాధ్యులుగా పరిగణిస్తున్నాము. స్కూలు బస్సుల్లో ప్రయాణించే పిల్లలు క్షేమంగా ఇంటికి చేరేలా చూసుకోవాల్సిన బాధ్యత స్కూలు వారిదే. బీద్ సిటీలోని అన్ని స్కూళ్లకు లెటర్ పంపుతాము. స్కూల్ బస్సుల్లో ప్రయాణించే పిల్లలను ఇంటికి క్షేమంగా చేరేలా చూసుకునే బాధ్యత స్కూలు యాజమాన్యానిదే. ఈ రూల్స్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు’ అని అన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ‘తప్పు ఎవరిదైనా శిక్ష మాత్రం పాప అనుభవిస్తోంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వైస్ కెప్టెన్ అయినా జట్టులో చోటు గ్యారంటీ కాదు.. తిలక్ వర్మకు కైఫ్ వార్నింగ్
హిందూ మహాసముద్రం మనందరి ఇల్లు.. సీషెల్స్‌లో భారత్ 'మహాసాగర్' సంకల్పం