Share News

పిల్ల కోతి చోరీ.. ఫోన్ తిరిగి ఇచ్చేసిన తల్లి కోతి.. వీడియో వైరల్..

ABN , Publish Date - Jun 28 , 2026 | 09:52 AM

కోతులకు సంబంధించిన ఓ ఆసక్తికర వీడియో ప్రస్తుతం అందరి మనసులనూ దోచుకుంటోంది. ఓ పర్యాటకుడి మొబైల్ ఫోన్‌ను లాగేసుకున్న పిల్ల కోతిని, తల్లి కోతి అడ్డుకుంది.

పిల్ల కోతి చోరీ.. ఫోన్ తిరిగి ఇచ్చేసిన తల్లి కోతి.. వీడియో వైరల్..
Viral monkey video

కోతులకు సంబంధించిన ఓ ఆసక్తికర వీడియో ప్రస్తుతం అందరి మనసులనూ దోచుకుంటోంది. ఓ పర్యాటకుడి మొబైల్ ఫోన్‌ను లాగేసుకున్న పిల్ల కోతిని, తల్లి కోతి అడ్డుకుంది. ఆ ఫోన్‌ను తిరిగి పర్యాటకుడికి ఇచ్చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఉత్తరాఖండ్ పోలీసులు తమ సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడంతో అది వేగంగా వైరల్‌గా మారింది (Monkey returns phone).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పిల్ల కోతి పర్యాటకుడి మొబైల్‌ను లాక్కుని వెళ్లిపోతోంది. అనంతరం తల్లి కోతి, పిల్ల కోతి దగ్గరకు వచ్చి ఫోన్‌ను బలవంతంగా తీసుకుంది. ఆ ఫోన్‌ను తిరిగి పర్యాటకుడికి అందజేసింది. ఆ సమయంలో పిల్ల కోతి గోడవ చేయకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి వారు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు (Monkey viral video).


ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉత్తరాఖండ్ పోలీసులు (Uttarakhand Police).. 'పిల్లలు మన మాటల కంటే మన ప్రవర్తన నుంచే ఎక్కువగా నేర్చుకుంటారు. జంతువులే తమ పిల్లలకు మంచి అలవాట్లు నేర్పగలుగుతున్నాయి. పిల్లలకు మంచి విషయాలు నేర్పడంలో మనం మరింత బాధ్యత తీసుకోవాలి' అనే క్యాప్షన్ జోడించారు. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు.. పలు సైనిక కేంద్రాలు ధ్వంసం..


స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఇవే..

Updated Date - Jun 28 , 2026 | 09:52 AM