ఒక వైపు మృగరాజు.. మరో వైపు 30 హైనాలు.. చివరకు ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Feb 28 , 2026 | 03:24 PM
సింహం అడవికి రారాజు. సింహాన్ని ఎదురించి నిలబడగలిగే జంతువులు చాలా తక్కువ. అయితే హైనాలు కూడా క్రూరమైన జంతువులే. ముఖ్యంగా గుంపులుగా నివసించే హైనాలు ఎలాంటి సింహాన్నైనా చంపగలవు. ఒకేసారి 30 హైనాలు మీద పడితే ఎంతటి సింహమైనా ప్రాణం మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే.
సింహం అడవికి రారాజు. సింహాన్ని ఎదురించి నిలబడగలిగే జంతువులు చాలా తక్కువ. అయితే హైనాలు కూడా క్రూరమైన జంతువులే. ముఖ్యంగా గుంపులుగా నివసించే హైనాలు ఎలాంటి సింహాన్నైనా చంపగలవు. ఒకేసారి 30 హైనాలు మీద పడితే ఎంతటి సింహమైనా ప్రాణం మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. తాజాగా ఓ సింహానికి అలాంటి అనుభవమే ఎదురైంది. అయితే ఆ సింహం ధైర్యంతో, ఓర్పుతో పోరాడి హైనాల నుంచి తప్పించుకుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Lion vs hyenas).
అడవిలో ఒంటరిగా కనిపించిన ఒక సింహాన్ని హైనాల గుంపు చుట్టుముట్టింది. సింహం చుట్టూ మూగిన హైనాలు బిగ్గరగా గర్జనలు చేస్తూ, దానిని భయపెడుతూ, ఉద్రిక్తతను సృష్టించాయి. హైనాలు ఎంత భయపెడుతున్నా సింహం మాత్రం సంయమనంతో వ్యవహరించింది. హైనాల గుంపు ఒకేసారి దాడికి దిగినా సింహం బెదరకుండా తన ప్రతాపం చూపించింది. ఒంటరిగా 30 హైనాలను భయపెట్టింది. చివరకు హైనాలు సింహానికి భయపడి దూరంగా వెళ్లిపోయాయి (Lion surrounded by hyenas).
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Wildlife viral video). @Axaxia88 అనే ఎక్స్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 50 వేల మందికి పైగా వీక్షించారు. వందల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. హైనాలను ఎదుర్కోవడం అంత సులభం కాదని ఒకరు కామెంట్ చేశారు. ఈ సింహం తన ఓర్పు, గుండె ధైర్యంతో అడవికి ఓ పాఠం నేర్పిందని మరొకరు ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
అందరి ముందూ పరువు పోయిందిగా.. వేదికపై వధూవరుల పరిస్థితి చేస్తే నవ్వురాక తప్పదు..
మీవి డేగ కళ్లు అయితే.. ఈ తోటలో తేనెటీగను 10 సెకెన్లలో గుర్తించండి..