అందరి ముందూ పరువు పోయిందిగా.. వేదికపై వధూవరుల పరిస్థితి చేస్తే నవ్వురాక తప్పదు..
ABN , Publish Date - Feb 28 , 2026 | 03:05 PM
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. పెళ్లికి సంబంధించిన ఫన్నీ ఘటనలు, ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటుంటాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వెడ్డింగ్ వీడియోలు నెట్టింట హల్‌చల్ చేశాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. పెళ్లికి సంబంధించిన ఫన్నీ ఘటనలు, ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటుంటాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వెడ్డింగ్ వీడియోలు నెట్టింట హల్‌చల్ చేశాయి. తాజాగా మరో పెళ్లి వీడియో నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. ఆ వీడియోలో వివాహ వేదికపై వధూవరుల పరిస్థితి అందరికీ నవ్వు తెప్పిస్తోంది (Funny wedding Video).
@hindugj అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వివాహ వేడుక జరుగుతోంది. వరుడు రిసెప్షన్ వేదికపై ఉన్నాడు. వధువు కింద ఉంది. వేదిక మీద నుంచి వరుడు తన భార్యకు చేయి అందించాడు. అయితే ఆ చేయి అందుకోవడానికి వధువు సిగ్గుపడింది. దీంతో వరుడు తన ప్రతాపం చూపించాలనుకున్నాడు. వేదిక కిందకు దిగి ఆమెను తన రెండు చేతులతో ఎత్తుకుని పైకి ఎక్కడానికి ప్రయత్నించాడు. అయితే పట్టు తప్పడంతో ఇద్దరూ కింద పడిపోయారు. పక్కనే ఉన్నవారు నవ్వుకున్నారు (Groom lifts bride fail).
ఈ సంఘటన మొత్తం కెమెరాలో రికార్డైంది (Bride and groom viral moment). ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. కొన్ని వేల మంది ఈ వీడియోను వీక్షించి తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. 'జీవితంలో ఆత్మవిశ్వాసం ముఖ్యం, కానీ అతి విశ్వాసం తరచుగా పొరపాట్లకు దారితీస్తుంది' అని ఒకరు కామెంట్ చేశారు. ఆ వ్యక్తి తన భార్యకు జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన ఓ పాఠం నేర్పాడని మరొకరు పేర్కొన్నారు.
ఈ వార్తలూ చదవండి:
ఇరాన్‌పై దాడులు.. దద్దరిల్లిన రాజధాని
నేను జోక్యం చేసుకునేవాణ్ణే కానీ.. అఫ్గాన్-పాక్ ఘర్షణలపై ట్రంప్ కామెంట్