ఏటీఎమ్ కార్డ్ పోగొట్టుకున్న అమెరికన్ యువతి.. మంచి మనసు చాటుకున్న యువకుడు..
ABN , Publish Date - Jun 04 , 2026 | 11:47 AM
ఏటీఎమ్ సెంటర్‌లో ఏటీఎమ్ కార్డ్ మర్చిపోయిన ఓ అమెరికన్ మహిళకు భారతీయ యువకుడు సాయం చేశాడు. దాదాపు 6 గంటల పాటు ప్రయాణం చేసి ఏటీఎమ్ కార్డును ఆమెకు తిరిగిచ్చాడు.
తిరువనంతపురం, జూన్ 4: ఏటీఎమ్ సెంటర్‌లో ఏటీఎమ్ కార్డ్ మర్చిపోయిన ఓ అమెరికన్ మహిళకు భారతీయ యువకుడు సాయం చేశాడు. దాదాపు 6 గంటల పాటు ప్రయాణం చేసి ఏటీఎమ్ కార్డును ఆమెకు తిరిగిచ్చాడు. ఈ విషయాన్ని సదరు అమెరికన్ యువతి స్వయంగా వెల్లడించింది. అమెరికన్ యువతి తెలిపిన వివరాల మేరకు.. న్యూయార్క్‌కు చెందిన ఇండియ విట్కిన్ అనే యువతి భారత్‌లో పర్యటించడానికి వచ్చింది. గురువారం కేరళలోని ఓ బీచ్ ఏరియాలో పర్యటించింది. శుక్రవాం ఉదయం ఏటీఎమ్‌లో డబ్బులు విత్‌డ్రా చేసి, కార్డును మెషీన్‌లోనే మర్చిపోయింది.
తర్వాత తిరువనంతపురం వచ్చేసింది. తిరువనంతపురం వచ్చిన తర్వాత ఏటీఎమ్ కార్డు పోగొట్టుకున్నట్లు గుర్తించింది. ఆమె దగ్గర డీహెచ్‌ఎల్ కొరియర్ బాయ్ కృష్ణ నంబర్ ఉండటంతో అతడికి ఫోన్ చేసింది. ఏటీఎమ్ కార్డు ఉందో లేదో చెక్ చేయమంది. కృష్ణ ఏటీఎమ్ సెంటర్ దగ్గరకు వెళ్లి చూశాడు. ఏటీఎమ్ కార్డు మెషీన్ మీద కనిపించింది. విట్కిన్ ఆ కార్డును తన దగ్గరకు తీసుకురమ్మని కృష్ణకు చెప్పింది. అతడు తన మిత్రుల సాయంతో ఆటోలో తిరువనంతపురం బయలుదేరి వెళ్లాడు. 6 గంటల ప్రయాణం తర్వాత వారంతా ఆమె దగ్గరకు చేరుకున్నారు.
కృష్ణ ఏటీఎమ్ కార్డును ఆమెకు తిరిగిచ్చేశాడు. దీంతో విట్కిన్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దీనిపై తన ఇన్‌గ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో కృష్ణపై ప్రశంసల జల్లులు కురిపించింది. మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని రాసుకొచ్చింది. కృష్ణతో తీసుకున్న వీడియోను కూడా షేర్ చేసింది. విట్కిన్ పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
ఏదో ఒక రోజు ఆయన్ను కలుస్తా.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
తమిళనాడులో ఫుడ్ పాయిజన్ కలకలం.. 100 మందికిపైగా అస్వస్థత