Share News

వేగంగా వెళ్తున్న బస్సు డ్రైవర్‌కు షాక్.. నడి రోడ్డుపై చిన్నారి ప్రత్యక్షం..

ABN , Publish Date - Jun 11 , 2026 | 03:15 PM

చిన్నారులను పెంచడం కత్తి మీద సాములాంటిది. నిత్యం వాళ్లను కనిపెట్టుకుంటూనే ఉండాలి. ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్నా ఊహించని విపత్తు ఎదురవొచ్చు. తాజాగా అలాంటి ఘటనే కేరళంలోని మలప్పురం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

వేగంగా వెళ్తున్న బస్సు డ్రైవర్‌కు షాక్.. నడి రోడ్డుపై చిన్నారి ప్రత్యక్షం..
Kerala Toddler Viral Video

కేరళం: చిన్నారులను పెంచడం కత్తి మీద సాములాంటిది. నిత్యం వాళ్లను కనిపెట్టుకుంటూనే ఉండాలి. ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్నా ఊహించని విపత్తు ఎదురవొచ్చు. ముఖ్యంగా అంబాడే, అప్పుడే నడక వచ్చిన చిన్నారుల విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రులు వారిని ఓ కంట కనిపెట్టకపోతే ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే కేరళంలోని మలప్పురం జిల్లాలో చోటుచేసుకుంది. ఓ చిన్నారి నడి రోడ్డుపై ప్రత్యక్షమై వాహనదారులకు షాక్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


మలప్పురం జిల్లా పులిక్కల్‌లో ఇళ్ల మధ్య ఉన్న రహదారిపై ఓ బస్సు వెళ్తోంది. పెద్దగా వాహనాలు లేకపోవడంతో డ్రైవర్ వేగంగా నడుపుతున్నాడు. అయితే, ఈ ప్రయాణంలో డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులకు అనుకోని విధంగా పెద్ద షాక్ తగిలింది. ఓ చిన్నారి నడి రోడ్డుపై కూర్చొని ఉండడం వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేసి వాహనాన్ని నిలిపివేశాడు. ఎదురుగా వస్తున్న వాహనాలు చిన్నారిని ఢీకొట్టకుండా కండక్టర్ హుటాహుటిన బాలిక వద్దకు పరిగెత్తాడు. వెంటనే ఆమెను చేతుల్లోకి తీసుకుని సురక్షితంగా కాపాడాడు. దీంతో బస్సు డ్రైవర్, కండక్టర్ సహా ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వెతుక్కుంటూ వెళ్లి మరీ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.


అయితే, అప్పటివరకు పాప అదృశ్యమైందన్న విషయం తల్లిదండ్రులకు తెలియకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా తమ కుమార్తెను కాపాడిన డ్రైవర్, కండక్టర్‌కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన జూన్ 10న ఉదయం సుమారు 8:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు బస్సు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇవి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే, చిన్నారిని నిర్లక్ష్యంగా వదిలేసిన తల్లిదండ్రులపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు బస్సు సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

అదృష్టమంటే ఈమెదే.. భారీ ఈదురుగాలుల సమయంలో ఏమైందో చూడండి..

షాక్ ఇచ్చిన బర్త్‌డే కేక్.. బాలుడి కడుపును స్కానింగ్ చేసి చూడగా..

Updated Date - Jun 11 , 2026 | 03:25 PM