Share News

వార్నీ.. ముందు చక్రాలతోనే నడుస్తున్న కారు.. రోడ్డుపై ఎలా వెళ్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Feb 21 , 2026 | 04:36 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే విచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.

వార్నీ.. ముందు చక్రాలతోనే నడుస్తున్న కారు.. రోడ్డుపై ఎలా వెళ్తున్నాడో చూడండి..
junk car viral video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే విచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Junk car viral video).


@Mr_arbaz_77 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. వాహనాలు తిరుగుతున్న బిజీ రోడ్డుపై ఒక వ్యక్తి విచిత్రమైన కారుపై ప్రయాణిస్తున్నాడు. ఆ కారుకు ఇంజిన్, రెండు చక్రాలు, స్టీరింగ్ వీల్, డ్రైవర్ సీటు మాత్రమే ఉన్నాయి. ఒక వ్యక్తి డ్రైవర్ సీటుపై హాయిగా కూర్చుని వాహనాన్ని అధిక వేగంతో నడుపుతున్నాడు. వెనుక చక్రాలు లేకపోవడంతో డ్రైవర్ సీటు రోడ్డు మీద రాసుకుంటూ వెళ్తోంది. ఇది చాలా ప్రమాదకరం అనే సంగతి తెలిసిందే (Bizarre car on road).


'ఇది నిజమైన ఓపెన్-ఎయిర్ డ్రైవింగ్ అనుభవం' అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు (Trending vehicle video ). ఈ వీడియోను వేల మంది వీక్షించారు. వందల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఇది చాలా ప్రమాదకర డ్రైవింగ్ అని ఒకరు కామెంట్ చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఆ కారును చూస్తే జరిమానా గ్యారెంటీ అని మరొకరు పేర్కొన్నారు. ఇలాంటి ప్రయోగాలు చాలా పెద్ద ప్రమాదాలకు కారణమవుతాయని మరొకరు హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

ఇదెక్కడి పిచ్చి బ్రదర్.. రీల్స్ కోసం ప్రాణాలతో చెలగాటం ఆడతారా..


మీ కళ్ల షార్ప్‌నెస్‌కు టెస్ట్.. ఈ పార్క్‌లో పుస్తకం ఎక్కడుందో 13 సెకెన్లలో గుర్తించండి..

Updated Date - Feb 21 , 2026 | 06:37 PM