వామ్మో.. జాబ్‌కు అప్లై చేసిన ఆరేళ్లకు దరఖాస్తు పరిశీలన మొదలు
ABN , Publish Date - Jun 20 , 2026 | 01:47 PM
జాబ్‌కు అప్లై చేసుకున్న ఆరేళ్లకు తన దరఖాస్తు పరిశీలన మొదలైందంటూ ఒక మహిళ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు కడుపుబ్బా నవ్వేలా చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: జాబ్‌కు అప్లై చేసుకున్న ఆరేళ్లకు ఒక మహిళ దరఖాస్తు పరిశీలన మొదలైన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు కడుపుబ్బా నవ్వేలా చేస్తోంది. ఈ ఉదంతంపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పల్లవీ తివారీ అనే మహిళ తనకు ఎదురైన ఈ వింత అనుభవాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
‘మొత్తానికి ఆరేళ్ల తరువాత నా దరఖాస్తును వాళ్లు పరిశీలించడం ప్రారంభించారు’ అని పల్లవి కామెంట్ చేశారు. ఆమె షేర్ చేసిన స్క్రీన్ షాట్‌లో దరఖాస్తును ఆరేళ్ల క్రితం సమర్పించినట్టు స్పష్టంగా ఉంది. కానీ దరఖాస్తు పరిశీలన మాత్రం 14 నిమిషాల క్రితం జరిగినట్టు కనిపించింది.
ఈ పోస్టుపై జనాల పలు ఫన్నీ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాన్వేషణలో సరికొత్త మైలురాయిని చేరుకున్నందుకు శుభాకాంక్షలని కొందరు కామెంట్ చేశారు. మరో ఆరేళ్ల తరువాత జాబ్‌కు ఎంపిక అవుతావని ఇంకొందరు సెటైర్ పేల్చారు. తమకూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని అన్నారు. ఒక జాబ్‌కు దరఖాస్తు చేసిన నాలుగేళ్ల తరువాత కంపెనీ వారు తన సేవలు అవసరం లేదని చెప్పినట్టు ఒక వ్యక్తి తెలిపారు. ‘అసలు ఇప్పుడు రిప్లై కూడా ఇవ్వడం ఎందుకు? ఇంతకాలం నేను వారి స్పందన కోసం వేచి చూస్తూ ఉంటానని అనుకున్నారా?’ అని సరదాగా వ్యాఖ్యానించారు.
ఈ వార్తలనూ చదవండి:
డబ్బులు మడతపెడుతున్నారా.. ఓసారి ఈ ట్రిక్ ట్రై చేసి చూడండి..
పెళ్లి చేసుకున్న ఇద్దరు మగాళ్లు.. కారణం ఏంటంటే..