Share News

మెకానిక్ అద్భుత సృష్టి.. మారుతీ 800ను లంబోర్గినిగా మార్చేశాడు..

ABN , Publish Date - Mar 05 , 2026 | 01:59 PM

ఓ మెకానిక్ కేవలం నాలుగు లక్షల రూపాయలతో సూపర్ కారును తయారు చేశాడు. మారుతీ 800 కారును లంబోర్గినిగా మార్చేశాడు. ఈ సంఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది.

మెకానిక్ అద్భుత సృష్టి.. మారుతీ 800ను లంబోర్గినిగా మార్చేశాడు..
Maruti 800 Lamborghini replica

ఇంటర్‌నెట్ డెస్క్: అత్యంత ఖరీదైన కార్లలో ‘లంబోర్గిని’కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. లంబోర్గిని బేసిక్ మోడల్ ధర 4 కోట్ల రూపాయలు పైనే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ మెకానిక్ కేవలం నాలుగు లక్షల రూపాయలతో సూపర్ కారును తయారు చేశాడు. మారుతీ 800 కారును లంబోర్గినిగా మార్చేశాడు. ఈ సంఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాంచీకి దగ్గరలోని చందిల్ టౌన్‌కు చెందిన మొహమ్మద్ ఆసిఫ్ అనే మెకానిక్‌కు కార్లంటే పిచ్చి. లంబోర్గిని అంటే ఎంతో మక్కువ చూపేవాడు.


లంబోర్గిని మీద ఉన్న మోజుతో ఓ అద్భుతమైన పనికి శ్రీకారం చుట్టాడు. ఎంతో కష్టపడి మారుతీ 800 కారును లంబోర్గినిగా మార్చాడు. కేవలం నాలుగు లక్షల రూపాయలతో 4 కోట్ల రూపాయలు విలువ చేసే లంబోర్గినిని పోలిన కారును తయారు చేశాడు. కారు తయారీ కోసం అద్దాలు, గ్లాసులు మాత్రమే బయట కొన్నాడు. మిగిలినవన్నీ సొంతంగా తయారు చేశాడు. ఆ కారు రీమోడల్ చేసినట్లుగా ఏమాత్రం కూడా లేకపోవటం గమనార్హం. ఆరిఫ్ ప్రస్తుతం ఆ కారులోనే బయట షికార్లకు వెళుతున్నాడు. కాస్ట్‌లీ కారులో అతడిని చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు.


అసలు విషయం తెలిసి నోరెళ్ల బెడుతున్నారు. ఆరిఫ్ రీ మోడల్ చేసిన ఈ కారుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘టాలెంట్ ఉంటే సాధించలేనిది అంటూ ఏదీ లేదు. ఓ సాధారణ కారును 4 కోట్ల రూపాయల కారుగా మార్చిన ఆరిఫ్‌ గ్రేట్ పర్సన్’..‘నువ్వు మామూలోడివి కాదు బ్రో.. నీకున్న ప్రతిభకు లంబోర్గిని కంపెనీలో ఉద్యోగం పక్కా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఆ రెండు బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం..

మావోయిస్టు అగ్రనేత గణపతి స్వగ్రామంలో టెన్షన్‌..

Updated Date - Mar 05 , 2026 | 02:09 PM