Share News

బాక్సింగ్ ఫైట్ మధ్యలో ఊహించని ఘటన.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు..

ABN , Publish Date - Feb 02 , 2026 | 06:58 AM

బాక్సింగ్ ఫైట్ మధ్యలో ఓ బాక్సర్‌కు ఊహించని షాక్ తగిలింది. అందరి ముందు అతడి పరువుపోయే సంఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ మొత్తం స్టోరీ చదవాల్సిందే.

బాక్సింగ్ ఫైట్ మధ్యలో ఊహించని ఘటన.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు..
wig flies off boxing

ఇంటర్‌నెట్ డెస్క్: సాధారణంగా బాక్సింగ్ ఫైట్‌లో బాక్సర్లు రక్తం చిందేలా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. ఆ సందర్భంలో ఎముకలు విరిగిపోవటం.. ఒక్కోసారి ప్రాణాలు పోవడం కూడా జరుగుతూ ఉంటాయి. అయితే తాజా సంఘటనలో బాక్సింగ్ ఫైట్ మధ్యలో ఓ బాక్సర్‌కు ఊహించని షాక్ తగిలింది. అందరి ముందు అతడి పరువు పోయే సంఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ మొత్తం స్టోరీ చదవాల్సిందే. సంగతేంటంటే..


అమెరికాకు చెందిన బాక్సర్ జారెల్ మిల్లర్ శనివారం మాడిషన్ స్క్వయర్ గార్డెన్‌లో జరిగిన బాక్సింగ్ ఫైట్‌లో పాల్గొన్నాడు. తన ప్రత్యర్థి కింగ్స్‌లే ఐబేతో తలబడ్డాడు. ఇద్దరి మధ్యా భీకర పోరు నడుస్తూ ఉంది. జారెల్ .. కింగ్స్‌లేను చిత్తు చిత్తుగా కొడుతూ ఉన్నాడు. వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది. అయినప్పటికీ కింగ్స్‌లే మధ్య మధ్యలో జారెల్‌పై స్ట్రైక్ చేస్తూనే ఉన్నాడు. ఓసారి కింగ్స్‌లే పంచ్ జారెల్ నెత్తిపై పడింది. అంతే.. అక్కడ ఉన్నవారంతా పగలబడి నవ్వే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. జారెల్ విగ్గు ఊడిపోయి పైకి లేచింది. అక్కడున్న వారిలో చాలా మంది నవ్వుకోవటం మొదలెట్టారు.


జారెల్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఫైట్ కొనసాగించాడు. ఈ పోటీలో కింగ్స్‌లేను ఓడించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కొన్ని రోజుల క్రితం నేను మా అమ్మవాళ్ల ఇంటికి వెళ్లాను. అక్కడ టేబుల్ మీద కొన్ని షాంపూ బాటిల్స్ కనిపించాయి. నేను ఓ షాంపూతో తల స్నానం చేశాను. అమ్మోనియం బ్లీచ్ జుట్టుకు రాసుకున్నట్లు.. ఒక్కసారిగా నా జుట్టంతా రాలిపోయింది. అందుకే విగ్ పెట్టుకున్నాను. నేను ఒక కమెడియన్‌ను.. నన్ను నేనే ఎగతాళి చేసుకుంటూ ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

తయారీకి ఊతం..

ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌ మరింత భారం

Updated Date - Feb 02 , 2026 | 07:31 AM