ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ మరింత భారం
ABN , Publish Date - Feb 02 , 2026 | 06:51 AM
స్టాక్ మార్కెట్లో రిటైల్ మదుపరులను నిండా ముంచుతున్న ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్‌కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈ లావాదేవీలపై...
ఎస్‌టీటీ భారాన్ని పెంచిన ఆర్థిక మంత్రి
ఫ్యూచర్స్‌పై 150ు, ఆప్షన్స్‌పై 50% పెంపు
మార్కెట్లో స్పెక్యులేషన్‌కు చెక్
2025-26లో రూ.63,670 కోట్లు
2026-27లో వసూళ్లు రూ.73,700 కోట్లు ఉంటాయని అంచనా
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో రిటైల్ మదుపరులను నిండా ముంచుతున్న ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్‌కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈ లావాదేవీలపై విధించే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ (ఎస్‌టీటీ)ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీగా పెంచేశారు. ప్యూచర్స్ లావాదేవీలపై విధించే ఎస్‌టీటీని 150 శాతం, ఆప్షన్స్ లావాదేవీలపై విధించే ఎస్‌టీటీని 50 శాతం పెంచుతున్నట్టు ఆదివారం ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతో ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై ప్రస్తుతం ఉన్న 0.02 ఎస్‌టీటీ నుంచి 0.05 శాతానికి చేరనుంది. ఆప్షన్స్ ప్రీమియంపై విధించే ఎస్‌టీటీ కూడా ప్రస్తుత 0.1 శాతం నుంచి 0.15 శాతానికి పెరగనుంది. ఆప్షన్ హక్కును వినియోగించుకోవడంపై విధించే ఎస్‌టీటీ కూడా ప్రస్తుత 0.125 శాతం నురచి 0.15 శాతానికి చేరనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌టీటీ ద్వారా రూ.63,670 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తాజా పెంపుతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో ఎస్‌టీటీ వసూళ్లు రూ.73,700 కోట్లు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఎఫ్‌పీఐలు వెనక్కి!
అయితే ఎఫ్ అండ్ ఓ లావాదేవీలపై ఎస్‌టీటీ పెంచడం స్వల్పకాలిక పెట్టుబడి లాభాల కోసం డెరివేటివ్స్‌లో మదుపు చేసే విదేశీ పోర్టుఫోలియో మదుపరుల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులను దెబ్బతీసే అవకాశం ఉందని కోటక్ సెక్యూరిటీస్ ఎండీ, సీఈఓ శ్రీపాల్ షా ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈల్లో ట్రేడింగ్ పరిమాణం కూడా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది. ఈ భయంతోనే ఆదివారం అనేక బ్రోకరేజీ సంస్థల షేర్లూ భారీగా నష్టపోయాయి.
ఎందుకంటే ?
ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ పూర్తిగా టెక్నికల్ అనాలిసి్‌సతో జరుగుతుంది. ఈ టెక్నికల్ అంశాలపై పెద్ద పెద్ద బ్రోకరేజీ సంస్థలకు, నిపుణులకు తప్ప సామాన్య రిటైల్ మదుపరులకు పెద్దగా పట్టు ఉండదు. అయినా రిటైల్ మదుపరుల్లో చాలా మంది ఎఫ్ అండ్ ఓలో ట్రేడింగ్ చేసి చేతులు కాల్చుకుంటున్నారు. ఈ ట్రేడింగ్ చేసే రిటైల్ మదుపరుల్లో 90 శాతం మంది నష్టపోతున్నారని సెబీ అధ్యయనంలోనే తేలింది. దీన్ని కట్టడి చేసేందుకు సెబీ కొన్ని చర్యలు తీసుకున్నా పెద్దగా ఫలితం లేదు. దీంతో ఈ లావాదేవీలపై ఎస్‌టీటీ పెంచడం ద్వారా దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రయత్నం చేశారని భావిస్తున్నారు. బడ్జెట్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ కూడా ఇదే విషయం చెప్పారు. ‘మార్కెట్లో స్పెక్యులేటివ్ ధోరణులకు చెక్ పెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగానే ఎఫ్ అండ్ ఓ లావాదేవీలపై ఎస్‌టీటీ పెంచాం’ అని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
ఆ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే: మంత్రి నిర్మలా సీతారామన్
2019 నుంచి 2026 వరకు.. 9 బడ్జెట్లు.. 14 గంటల ప్రసంగం..