Share News

వీడు మామూలోడు కాదు.. సెకన్లలో రూ.4 లక్షలు కొట్టేశాడు..

ABN , Publish Date - Feb 15 , 2026 | 02:21 PM

రాజస్థాన్‌లో ఓ దొంగ పెళ్లిలో చేతివాటం చూపించాడు. ఏకంగా పెళ్లి కూతురికి సంబంధించిన బ్యాగ్‌నే కొట్టేశాడు. డబ్బు, నగలు ఉన్న ఆ బ్యాగ్‌తో ఉడాయించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

వీడు మామూలోడు కాదు.. సెకన్లలో రూ.4 లక్షలు కొట్టేశాడు..
Jaipur wedding theft

ఇంటర్‌నెట్ డెస్క్: పెళ్లిలో ఓ దొంగ చేతి వాటం చూపించాడు. ఏకంగా పెళ్లి కూతురికి సంబంధించిన బ్యాగ్‌నే కొట్టేశాడు. డబ్బు, నగలు ఉన్న ఆ బ్యాగ్‌తో ఉడాయించాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 7వ తేదీన జైపూర్, జగత్‌పురా ఏరియాలోని చందన్ వన్ మ్యారేజ్ గార్డెన్‌లో నవీన్ కరోల్ అనే వ్యక్తి పెళ్లి జరిగింది. రాత్రి 10.15 గంటల సమయంలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అతిథులతో ఫొటోలు దిగటంలో బిజీ అయిపోయారు.


ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి పెళ్లి కొడుకును పలకరించి మాట్లాడుతున్నాడు. ఇదే సమయంలో చేత్తో బ్లేజర్ పట్టుకున్న ఓ వ్యక్తి.. వెడ్డింగ్ చైర్ వెనుక నడుచుకుంటూ వచ్చాడు. పెళ్లి కూతురు పక్కన.. వెడ్డింగ్ చైర్ పక్కనే ఉన్న బ్యాగును చేతిలోకి తీసుకుని, అక్కడినుంచి మెల్లిగా జారుకున్నాడు. ఈ దొంగతనం మొత్తం సెకన్లలో జరిగిపోయింది. కొద్దిసేపటి తర్వాత పెళ్లి కూతురు బ్యాగ్ కోసం వెతగ్గా అది కనిపించలేదు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. చోరీ విషయం బయటపడింది.


అందరూ బ్యాగ్ దొంగతనం చేసిన వ్యక్తి కోసం వెతికారు కానీ.. ఆ వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. చేసేదేమీ లేక చివరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ బ్యాగులో ఉన్న నగలు, డబ్బుల విలువ రూ.4 లక్షలు ఉంటుందని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి..

కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేసేందుకు మద్దతు ఇవ్వండి: బంజారాలకు కేటీఆర్ పిలుపు

టెక్ సంస్థలది ఈస్ట్ ఇండియా కంపెనీ రేంజ్! శ్రీధర్ వెంబు పోస్టు వైరల్

Updated Date - Feb 15 , 2026 | 03:37 PM