Share News

AI Generated Plane Crash: కొంపముంచిన ఏఐ.. యువకుడిపై పోలీస్ కంప్లైంట్

ABN , Publish Date - Jan 17 , 2026 | 08:22 AM

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు ఏఐ వీడియోల కారణంగా చిక్కుల్లో పడ్డాడు. అతడిపై పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది. ఆ యువకుడు ఏఐని ఉపయోగించి విమాన ప్రమాదం జరిగిందంటూ ఫేక్ వీడియోలు తయారు చేశాడు. దీంతో డుమ్నా ఎయిర్ పోర్ట్ అధికారులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

AI Generated Plane Crash: కొంపముంచిన ఏఐ.. యువకుడిపై పోలీస్ కంప్లైంట్
AI Generated Plane Crash

ఈ మధ్య కాలంలో ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అన్ని రంగాల్లో ఏఐని వాడేస్తున్నారు. అయితే, కొంతమంది ఏఐతో ఫేక్ వీడియోలు, ఫొటోలు తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఏఐ వీడియోలు వాస్తవానికి ఏమాత్రం తీసిపోకుండా ఉంటున్నాయి. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా, ఓ యువకుడు ఏఐ వీడియోల కారణంగా చిక్కుల్లో పడ్డాడు. అతడిపై పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి ఏఐని వాడాడు.


అది కూడా ఏఐని ఫేక్ వీడియోలు తయారు చేయడానికి వాడాడు. జబల్‌పూర్‌లోని డుమ్నా ఎయిర్ పోర్ట్ దగ్గర విమాన ప్రమాదం జరిగిందంటూ కొన్ని ఫేక్ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫేక్ వీడియోలు వాస్తవానికి ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి. వాటిని చూస్తే.. నిజంగానే విమాన ప్రమాదం జరిగింది అనేలా ఉన్నాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. డుమ్నా ఎయిర్ పోర్ట్ అధికారుల దృష్టికి కూడా వెళ్లాయి. ఆ ఫేక్ వీడియోలపై ఎయిర్ పోర్ట్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ వీడియోలు తయారు చేసిన యువకుడిపై చర్యలకు సిద్ధమయ్యారు.


అతడిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎయిర్ పోర్ట్ గౌరవాన్ని దెబ్బ తీసేలా ఫేక్ వీడియోలు చేస్తున్నాడని, తప్పుడు వీడియోల కారణంగా స్థానిక ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి కోసం గాలిస్తున్నారు. ఎయిర్ పోర్టు అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫేక్ వీడియోలు తయారు చేస్తున్న వారు మీకు తెలిస్తే వెంటనే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయండి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఫేక్ వీడియోలు షేర్ చేసే వారిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేయండి’ అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి

జేఎన్‌టీయూలో.. ప్రమోషన్లు అందని ద్రాక్షేనా..?

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు కొత్త వెబ్‌సైట్‌..

Updated Date - Jan 17 , 2026 | 08:54 AM