Share News

82 ఏళ్ల వృద్ధురాలికి పైబెర్తు కేటాయింపు! స్పందించిన రైల్వే

ABN , Publish Date - Mar 01 , 2026 | 03:21 PM

82 ఏళ్ల వృద్ధురాలికి ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్ బుక్ చేస్తే పైబెర్త్ వచ్చిందంటూ ఓ వ్యక్తి నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై ఐఆర్‌సీటీసీ స్వయంగా వివరణ ఇచ్చింది.

82 ఏళ్ల వృద్ధురాలికి పైబెర్తు కేటాయింపు! స్పందించిన రైల్వే
IRCTC upper berth issue

ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్‌ బుకింగ్ అంశం మరోసారి నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వృద్ధురాలికి రైల్లో పైబెర్త్ కేటాయించడాన్ని ప్రశ్నిస్తూ ఓ వ్యక్తి నెట్టింట పోస్టు పెట్టడం చర్చకు దారి తీసింది. ఈ అంశంపై ఐఆర్‌‌సీటీసీ కూడా స్పందించింది.

ఎక్స్ వేదికగా ఓ వ్యక్తి ఈ పోస్టు పెట్టారు. 82 ఏళ్ల వృద్ధురాలికి తాను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టిక్కెట్ బుక్ చేస్తే పైబెర్త్‌ను కేటాయించారని విచారం వ్యక్తం చేశారు. దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. తమకూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని పలువురు కామెంట్ చేశారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదని మరికొందరు అన్నారు. ఈ విషయమై చర్చ పెద్దది కావడంతో స్వయంగా ఐఆర్‌‌సీటీసీ స్పందించింది. అసలు ఏం జరిగిందో వివరించింది.


బెర్తు‌ల కేటాయింపు విషయంలో రూల్స్‌పై క్లారిటీ ఇచ్చింది. 45 ఏళ్లు దాటిన మహిళలకు కింది బెర్తులను కేటాయించే విధానం కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ వ్యవస్థలో ఉందని తెలిపింది. ఇలాంటి బెర్తే కావాలని ప్యాసెంజర్ చెప్పని పక్షంలోనూ 45 ఏళ్లు దాటిన మహిళలకు కిందిబెర్తులనే కేటాయించే అవకాశం ఉన్నప్పటికీ ఇది బెర్తుల లభ్యతపై ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. కాబట్టి, ముందుగా టిక్కెట్ బుక్ చేసుకునే వారికే ఇలాంటి సందర్భాల్లో కిందిబెర్తులు లభించే అవకాశం ఉంటుందని తెలిపింది. ఇక లోయర్ బెర్తు ఉంటేనే టిక్కెట్‌ బుక్ అయ్యే ఆప్షన్‌ను ప్యాసెంజర్‌లకు ఎంచుకుని బుకింగ్ చేసుకోవచ్చని కూడా వివరించింది.


ఇవి కూడా చదవండి..

అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..

కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 01 , 2026 | 03:35 PM