Share News

బొద్దింక తల లేకపోయినా బతకగలదు.. ఈ జీవికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసా..

ABN , Publish Date - May 23 , 2026 | 05:02 PM

చాలామందికి అసహ్యం కలిగించే బొద్దింకలు నిజానికి ప్రకృతిలో అత్యంత ఆశ్చర్యకరమైన జీవుల్లో ఒకటి. కోట్ల సంవత్సరాలుగా భూమిపై జీవిస్తున్న ఈ పురుగులు తమ ప్రత్యేక లక్షణాలతో శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి

బొద్దింక తల లేకపోయినా బతకగలదు.. ఈ జీవికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసా..
cockroach facts

చాలామందికి అసహ్యం కలిగించే బొద్దింకలు నిజానికి ప్రకృతిలో అత్యంత ఆశ్చర్యకరమైన జీవుల్లో ఒకటి. కోట్ల సంవత్సరాలుగా భూమిపై జీవిస్తున్న ఈ పురుగులు తమ ప్రత్యేక లక్షణాలతో శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. బొద్దింకలు దాదాపు 30 కోట్ల సంవత్సరాల కంటే ముందే భూమిపై ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డైనోసార్ల కంటే ముందే ఇవి జీవించేవని పరిశోధనలు వెల్లడించాయి. వాటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం (Interesting facts about cockroaches).


బొద్దింకల తల తెగిపోయినా కూడా కొన్ని రోజుల పాటు జీవించగలవు. ఎందుకంటే అవి మనుషుల్లా ముక్కు ద్వారా కాకుండా శరీరంలోని చిన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. బొద్దింకలు నీటిలో కూడా కొంతసేపు జీవించగలవు. అవి దాదాపు 40 నిమిషాల వరకు శ్వాసను నియంత్రించుకోగల సామర్థ్యం కలిగి ఉంటాయి. చిన్నగా కనిపించినా బొద్దింకలు చాలా వేగంగా పరుగెత్తగలవు. ఇవి గంటకు దాదాపు ఐదు కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవట (Cockroach facts).

cockroach2.jpg


బొద్దింకలు కుళ్లిపోయిన ఆకులు, మొక్కల పదార్థాలను తింటూ ప్రకృతిలో వ్యర్థాలను కరిగించడంలో సహాయపడతాయి. నేలలో పోషకాలను పెంచడంలో కూడా వాటి పాత్ర ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బొద్దింకలు ఇరుకైన ప్రదేశాల్లో సులభంగా కదలగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటి శరీర నిర్మాణాన్ని పరిశీలించి వాటి స్ఫూర్తితో శాస్త్రవేత్తలు ప్రత్యేక రోబోలను రూపొందిస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేసే రోబోట్ల తయారీలో వీటి శరీర నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు (Cockroach science).


ప్రపంచవ్యాప్తంగా 4,600 కంటే ఎక్కువ బొద్దింక జాతులు ఉన్నాయి. అయితే వాటిలో చాలా తక్కువ జాతులే మన ఇళ్లలో కనిపిస్తాయి. మిగతావి అడవులు, చెట్ల పొదలు వంటి సహజ వాతావరణాల్లో జీవిస్తాయి. ఇళ్లలో ఉండే బొద్దింకలు ఆహారాన్ని కలుషితం చేసి బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో అలర్జీలు, ఆస్తమా సమస్యలను కూడా పెంచుతాయి.


ఇవి కూడా చదవండి..

రాజ్యసభ సీటు అమ్ముకున్నారు.. ఆప్‌పై హర్భజన్ సంచలన ఆరోపణలు..


టెహ్రాన్‌కు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు..

Updated Date - May 23 , 2026 | 05:09 PM