Share News

యువతికి ఊహించని షాక్.. స్నానం చేసినందుకు రూ. లక్ష ఫైన్..

ABN , Publish Date - Aug 19 , 2026 | 08:53 PM

ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న ఓ భారతీయ యువతికి ఊహించని షాక్ తగిలింది. వేడి నీటి స్నానం కారణంగా ఆమెకు లక్ష రూపాయల ఫైన్ పడింది.

యువతికి ఊహించని షాక్.. స్నానం చేసినందుకు రూ. లక్ష ఫైన్..
Indian woman ₹1.3 lakh fine

ఇంటర్‌నెట్ డెస్క్: ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న ఓ భారతీయ యువతికి ఊహించని షాక్ తగిలింది. వేడి నీటి స్నానం కారణంగా ఆమెకు లక్ష రూపాయల ఫైన్ పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. భారత్‌కు చెందిన వామికా అనే యువతి ఆస్ట్రేలియాలో చదువుకుంటోంది. వామికా ఎప్పటిలాగే వేడి నీటి స్నానం చేసింది. అయితే, స్నానం చేస్తున్నపుడు బాత్‌రూములోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఆమె ఆఫ్ చేసింది. దీంతో వేడి నీటి కారణంగా ఏర్పడ్డ ఆవిరి బాత్‌రూము నుంచి బయటకు వెళ్లింది. బయట ఉన్న స్మోక్ డిటెక్టర్‌ను ఆవిరి కప్పేసింది.


ఆవిరిని పొగగా భావించిన ఫైర్ అలారం ఒక్కసారిగా మోగటం మొదలెట్టింది. పోలీసులు ఫైర్ ఇంజిన్‌తో సహా ఆ ఇంటి దగ్గరకు వచ్చారు. ఇంటి దగ్గర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సూచనలు లేకపోవటంతో.. యువతిని ఎంక్వైరీ చేశారు. ‘నాకు ఏమీ తెలీదు. అలారం మోగుతుంటే ఫైర్ డ్రిల్ అనుకున్నాను’ అని యువతి అధికారులతో చెప్పింది. అయితే, ఫైర్ అలారం మోగటానికి కారణమైనందుకు గాను యువతికి అధికారులు 1800 డాలర్ల ఫైన్( ట్యాక్స్‌లు అదనం) వేశారు. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఆ మొత్తం 1.30 లక్షల రూపాయలు పైనే ఉంటుంది.


తనకు ఎదురైన ఈ దారుణమైన అనుభవాన్ని యువతి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. 1800 డాలర్ల ఫైన్ పడినందుకు కంటతడి పెట్టుకుంది. యువతి పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది భారతీయులు విదేశాల్లో తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు. తనకు కూడా ఫైర్ అలారం కారణంగా 1800 డాలర్ల ఫైన్ పడిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


ఇవి కూడా చదవండి

వందేమాతరం వివాదం.. 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామన్న కాంగ్రెస్‌..

అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదు: సీఈవో

Updated Date - Aug 19 , 2026 | 09:05 PM