వివాహేతర సంబంధం.. భర్తని పక్కా పథకంతో హత్య చేసిన భార్య..
ABN , Publish Date - Jun 09 , 2026 | 05:31 PM
వివాహేతర సంబంధాల మోజులో పడి కొంత మంది భార్యాభర్తలు పండంటి కాపురాలను నాశనం చేసుకుంటారు. భర్త వేధిస్తున్నాడనో, సరిగా చూసుకోవడం లేదనో భార్యలు పరాయి వ్యక్తులకు ఆకర్షితులవుతున్నారు. తాజాగా అటువంటి ఘటనే మహారాష్ట్ర బీడ్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: వివాహేతర సంబంధాల మోజులో పడి కొంత మంది భార్యాభర్తలు పండంటి కాపురాలను నాశనం చేసుకుంటారు. భర్త వేధిస్తున్నాడనో, సరిగా చూసుకోవడం లేదనో భార్యలు పరాయి వ్యక్తులకు ఆకర్షితులవుతున్నారు. భార్య తనను పట్టించుకోవడం లేదనో, చెప్పినట్లుగా నడుచుకోవడం లేదనో భర్తలు వేరే మహిళలకు దగ్గరవుతున్నారు. అయితే, విషయం అక్కడితో ఆగిపోవడం లేదు. ప్రియుడు లేదా ప్రియురాలి మోజులో పడి కట్టుకున్న వారిని కడతేర్చేందుకు భాగస్వాములు సిద్ధమవుతున్నారు. తాజాగా అటువంటి ఘటనే మహారాష్ట్ర బీడ్ జిల్లాలో చోటుచేసుకుంది.
బీడ్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఐదు రోజుల కిందట కిరణ్ సోనావానే అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రమాద తీరును పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో గొంతు నులమడం వల్లే కిరణ్ ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. సాధారణ రోడ్డు ప్రమాదం కాదని నిర్ధారించుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపారు. దర్యాప్తులో సంచలన విషయాలను గుర్తించారు. కిరణ్ భార్య, ఆమె ప్రియుడు ఇద్దరూ కలిసి హత్యకు పథకం వేసినట్లు కనిపెట్టారు.
కిరణ్ సోనావానే భార్య ప్రియాంకకు దశరథ్ పర్దేశి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియాంక, దశరథ్ పథకం ప్రకారం హత్య చేసినట్లు పేర్కొన్నారు. కిరణ్‌ను దశరథ్ అతని స్నేహితుడు ధీరజ్ యెడే గొంతు నులిమి చంపారని వెల్లడించారు. ఆ తర్వాత రోడ్డు పక్కన ద్విచక్రవాహనం కింద మృతదేహాన్ని పడుకోబెట్టి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని చెప్పారు. అనంతరం తన ప్రియురాలు ప్రియాంకకు దశరథ్ ఫోన్ చేసి 'ప్రోగ్రామ్ ఓకే' అని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ముగ్గురు నిందితులు పన్వెల్‌కు పారిపోయారని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అడిగి మరీ మసాజ్ చేయించుకున్న ఏనుగు.. వైరల్ వీడియో
కొంపముంచిన రూ. 370 బిర్యానీపై కామెంట్లు.. ఇలా జరుగుతుందని అనుకోలేదు..