మానవత్వానికి నిదర్శనం: నదిలో పడిపోయిన కుక్క కోసం ఒక్కటైన జనం.. వీడియో వైరల్
ABN , Publish Date - May 13 , 2026 | 07:20 AM
మానవత్వానికి సరిహద్దులు లేవని, ఆపదలో ఉన్న ప్రాణాన్ని కాపాడటమే అసలైన ధర్మమని పారిస్ వాసులు మరోసారి నిరూపించారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: మానవత్వానికి సరిహద్దులు లేవని, ఆపదలో ఉన్న ప్రాణాన్ని కాపాడటమే అసలైన ధర్మమని పారిస్ వాసులు నిరూపించారు. పారిస్‌లోని ప్రసిద్ధ ఫ్రాంకోయిస్ మిట్టరాండ్ లైబ్రరీ సమీపంలో, ఒక నల్ల కుక్క ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. అది గమనించిన బాటసారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని మానవ గొలుసుగా ఏర్పడి, ఆ కుక్కను క్షేమంగా పైకి లాగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పారిస్‌లోని ఫ్రాంకోయిస్ మిట్టరాండ్ లైబ్రరీ సమీపంలో ఒక కుక్క కాలువలో పడిపోయింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆ కుక్క ఒడ్డుకు రాలేక ప్రాణభయంతో అల్లాడిపోయింది. అది గమనించిన బాటసారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగారు. ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని నది అంచు వరకు ఒక 'మానవ గొలుసు'లా ఏర్పడి ఆ కుక్కకు ఆసరాగా నిలిచారు. ఇదే సమయంలో ఒక యువకుడు నీటిలోకి దిగి, ప్రవాహంలో కొట్టుకుపోతున్న కుక్కను సురక్షితంగా పట్టుకున్నాడు. పైన ఉన్నవారు మానవ గొలుసు సాయంతో అతడిని ఆ జంతువును అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ‘మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని చెప్పడానికి ఈ దృశ్యాలే నిదర్శనం’అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. 9 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు..
నడిరోడ్డుపై ఖడ్గ మృగాల భీకర పోరు.. బెంబేలెత్తిన జనం..